TMC Leader: “మీ ఇంట్లోకి దూరి మీ తల్లులు, అక్కాచెల్లెళ్ల అసభ్యకరమైన ఫోటోలు తీస్తాం..”
- కోల్‌కతా వైద్యురాలి హత్యాచారంపై బెంగాల్‌లో కొనసాగుతున్న ఆందోళనలు..
- ఆందోళనకారుల్ని బెదిరిస్తున్న టీఎంసీ నాయకుడి వీడియో వైరల్..
- ఇళ్లలోకి దూరి మీ అమ్మ.. అక్కాచెల్లెళ్ల అసభ్యకరమైన ఫోటోలు తీస్తామని బెదిరింపు..
- సదరు నేతను సస్పెండ్ చేసిన తృణమూల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC Leader: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై ఆర్ జీ మెడికల్ కాలేజ్ సెమినార్ హాలులో ఈ ఘటన జరిగింది. నిందితుడైన సంజయ్ రాయ్‌పై చర్యలు తీసుకోవాలని వైద్యులతో సహా సాధారణ ప్రజలు దేశవ్యాప్తంగా నిరసనలు చేశారు. వెస్ట్ బెంగాల్‌లో ఇప్పటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటన రాష్ట్రంలోని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సర్కారుపై వ్యతిరేకతను పెంచింది.
Read Also: Meta AI: ఆత్మహత్యకుమందు యువతి సోషల్ మీడియాలో పోస్ట్.. పోలీసులకు ఫోన్ చేసి కాపాడిన మెటా ఏఐ
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
నిరసనలు మిన్నంటడంతో తృణమూల్ నాయకులు నిరసనకారుల్ని బెదిరిస్తూ వీధి గుండాల్లా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బెంగాల్ తగలబడితే ఢిల్లీ, యూపీ, ఒడిశా, బీహార్, అస్సాం తగలబడుతుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, తాజాగా టీఎంసీకి చెందిన నాయకుడు అతిష్ సర్కార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టే వారిని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘‘ మేము మీ ఇళ్లలోకి దూరి మీ తల్లులు, అక్కాచెల్లెళ్ల అసభ్యకరమైన ఫోటోలు తీసి, వీధుల్లో గోడలపై అంటిస్తాము’’ అని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలు చేసినందుకు సదరు టీఎంసీ మాజీ కౌన్సిలర్ అయిన అతిష్ సర్కార్‌పై ఒక ఏడాది పాటు పార్టీ సస్పెన్షన్ విధించింది. అయితే, అతను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నార్త్ 24 పరగణాస్‌లోని అశోక్ నగర్‌కి చెందిన టీఎంసీ నేత అయిన సర్కార్ బెదిరిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘మేము మీ వీధుల్లో తిరిగితే ఒక్కరైన బయటకు రాగలరా..?’’ అని బెదిరించాడు. అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ ఫైర్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతుంటే, టీఎంసీ నేతలు గుండాల్లా వ్యవహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టింది.
While the entire nation and West Bengal are demanding justice for R.G.'s sexual harassment and condemning government failures, TMC leaders are unleashing vile threats.
TMC goons, emboldened by Mamata Banerjee's call to 'create chaos,' are now threatening to deface homes with… pic.twitter.com/pjWUWWdvWG
— BJP West Bengal (@BJP4Bengal) September 1, 2024
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!