TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
- మమతా బెనర్జీకి కష్టాలు రెట్టింపు..
- నేషనలిస్ట్ సిటిజన్ పార్టీలోకి టీఎంసీ రెబల్ ఎంపీలు..
- విలీనం అయ్యేందుకు నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC Crisis: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి వరస ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. ఆ పార్టీకి లోక్‌సభలో 28 మంది ఎంపీలు ఉంటే, 20 మందికి పైగా ఎంపీలు తిరుగుబాటు చేశారు. వీరంతా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు, మమత ఇండియా కూటమిలో ఉన్నప్పుడు, ఎంపీలు మాత్రం ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యం కాబోతున్నారు.
ఇదిలా ఉంటే, రెబల్ వర్గంగా ఉన్న 20 మంది ఎంపీలు, తమ వర్గాన్ని ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (NCPI) అనే ప్రాంతీయ పార్టీలో విలీనం చేసి, ఆ తర్వాత ఎన్డీయేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం సంచలనంగా మారింది. ఈ చర్యతో టీఎంసీలో సంక్షోభం మరింత ముదిరింది. టీఎంసీలోనే ప్రత్యేక వర్గంగా ఉండటం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే రెబల్ వర్గం విలీనం ఆలోచనతో ప్లాన్ చేసింది.
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
“మేము ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’లో చేరాము. ఇది గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ. మేము అందులో విలీనమయ్యాము. అసలైన టీఎంసీ ఏది అనేది కోర్టు నిర్ణయిస్తుంది,” అని టీఎంసీ రెబల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అన్నారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో సమావేశం తర్వాత ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలో రెబల్ వర్గం సమావేశమైన కొన్ని గంటల తర్వాత ఈ రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు, మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఓం బిర్లాకు లేఖ రాస్తూ.. టీఎంసీని ఒకే రాజకీయ పార్టీగా పరిగణించాలని, పార్టీకి చెందిన ఏ ఇతర వర్గానికి లేదా సమూహానికి ఎలాంటి గుర్తింపు, సదుపాయాలు కల్పించొద్దని కోరారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!