Trinamool Congress: చీలిక దిశగా మమత పార్టీ.. 50 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై..!
- మమతా బెనర్జీకి షాక్..
- తృణమూల్ కాంగ్రెస్‌తో తీవ్ర సంక్షోభం..
- మమతకు గుడ్ బై చెప్పనున్న 50 మంది ఎమ్మెల్యేలు..
- రీటబ్రత బెనర్జీ నేతృత్వంలో పార్టీని చేజిక్కించుకునే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trinamool Congress: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీ కోటలు కూలిపోతున్నాయి. ఆమె పార్టీ ఆమె చేజారే పరిస్థితి నెలకొంది. టీఎంసీ ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు రెడీ అయ్యారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే రిటబ్రత బెనర్జీ నాయకత్వంలో పార్టీని చేజిక్కించుకునేలా పావులు కదుపుతున్నట్లు వినికిడి. స్వయంగా మమతా బెనర్జీ సమావేశాలు పెట్టినా, ఎమ్మెల్యేలు రావడం లేదు. మంగళవారం కోల్‌కతాలో జరిగిన ధర్నాకు కేవలం 5 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 80 మంది టీఎంసీ నుంచి గెలుపొందారు.
టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి రిజు దత్తా సంచలన విషయాలు వెల్లడించారు. టీఎంసీలో సంక్షోభం తీవ్రమైనట్లు చెప్పారు. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీకి షాక్ ఇచ్చి, పార్టీకి చెందిన ‘‘రెండు పువ్వుల’’ ఎన్నికల గుర్తు, పార్టీని దక్కించుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. రిజు దత్తాను ఇప్పటికే టీఎంసీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
దక్షిణ కోల్‌కతాలోని ఒక హోటల్లో ఎమ్మెల్యేలు రీటబ్రత బెనర్జీ, సందీపన్ సాహా పలువురు ఇతర ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించారని టీఎంసీ నాయకుడు కునాల్ ఘోష్ ఆరోపించారు. అయితే, ఈ వార్తల్ని రీటబ్రత ఖండించారు. జూన్ 18 తేదీన బెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లోపే టీఎంసీ విచ్ఛిన్నమవుతుందనే వార్తలు వస్తున్నాయి. అంతకుముందు, అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన రోజు మమతా తన నివాసంలో సమావేశానికి పిలుపునిస్తే 80 మంది ఎమ్మెల్యేలకు గానూ కేవలం 20 మందే హాజరయ్యారు. దీంతో సమావేశం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీనికి ముందు ఒక ధర్నాకు కేవలం33 మంది మాత్రమే వచ్చారు. ఇలా రోజు రోజుకు మమత తన ఎమ్మెల్యేలను కోల్పోతున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!