Mysterious Devil’s Road: సాధారణంగా ప్రజలు దెయ్యాలు.. దెయ్యాల కథల గురించి తెలుసుకోవటానికి ఇష్టపడతారు. కొందరు వీటిని కట్టుకథలుగా కొట్టిపారేస్తుంటారు. కానీ కొన్ని సంఘటనలు నేటికీ వీటిపై నమ్మకాన్ని పెంచుతూనే ఉన్నాయి. ప్రయాణంలో చాలామందికి అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ కొన్ని రోడ్డు మార్గాల్లో ప్రమాదాలు జరగడానికి గల కారణాలను అన్వేషిస్తే.. అనేక నమ్మశక్యంకాని వాస్తవాలు మీకు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు ఈ జాబితాలోని రోడ్లపై ప్రయాణించడం మానేయడం మంచిది. ఈ మార్గాలు భయంకరమైనవిగా ఎందుకు పిలుస్తున్నారో తెలుసుకుందాం.
Read also: 2011 Phool Mohammad case: పూల్ మహ్మద్ హత్య కేసులో డీఎస్పీతో సహా 30 మందికి యావజ్జీవం..
మీరు ఆ రోడ్డుపై వెళుతుంటే.. మీ ఫోన్ లోని టైం ఒక్కసారిగా 2022 నుంచి 2024లోకి మారుతుంది. యాప్స్ పనిచేయడం ఆగిపోతాయి. స్ట్రీట్ లైట్లు మిణుకుమిణుకు మంటూ కనిపిస్తాయి. ఇదంతా చదువుతుంటే ఏదో హార్రర్ సినిమా స్టోరీలా అనిపిస్తోందా..? ఇలాంటి ఎక్స్పీరియెన్స్ మీరూ రియల్గా ఫీల్ కావొచ్చు. అయితే, మీరు వెంటనే రాంచీ సమీపంలో ఉన్న తైమారా లోయకి వెళ్లే నేషనల్ హైవే 33కి వెళ్లాల్సిందే. దీన్ని చూసి చాలామంది ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనవుతుంటారు. అయితే, అక్కడ ఉన్నవారికి మాత్రం ఇది చాలా సాధారణమైన విషయం. ఎందుకంటే ఆ రోడ్డుపై దెయ్యాలు తిరుగుతూ ఉంటాయని, అందుకే అలా టైం మారుతూ ఉంటుందని నమ్ముతారు. ప్రతిరోజూ రాత్రిపూట ఓ ఆడ దెయ్యం తెల్లదుస్తుల్లో రోడ్డుపై సంచరిస్తూ ఉంటుందని ఒక ఫొటో కూడా ఇంటర్నెట్లో తెగ వైరల్ అయింది. అయితే, సెల్ఫోన్ కాకుండా.. చేతి వాచ్ తీసుకెళితే టైం మారదని, సెల్ ఫోన్లో కూడా ఆటోమాటిక్ టైమ్ అప్‌డేట్ ఆన్ చేసి ఉంటేనే టైం మారుతుందట. ఇది హంటెడ్ కాదని, దీనంతటికీ కారణం ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Sake Sailajanath: పది ఇళ్ళు కూడా కట్టలేని దుస్థితిలో జగన్