ఈ మధ్య కాలంలో వన్య మృగాలు అడవులను వదిలి జనావాసాలపై పడుతున్నాయి. జనాలపై దాడి చేస్తూ.. భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయి. అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్నవారి పరిస్థితి దారుణంగా తయారైంది. ఎప్పుడే ఏ జంతువు దాడి చేస్తుందోనన్ని కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. అటవీ సిబ్బంది కూడా ఈ వన్య మృగాలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మహారాష్టలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు పులులతో రోజు భయపడుతూ జీవిస్తున్నారు. అయితే ఓ విన్నూత ఆలోచనకు శ్రీకారం చుట్టారు.
Read Also:Health Tips: షుగర్ కంట్రోల్‌కు ఈ చిట్కాలను ట్రై చేయండి..
మహారాష్ట్ర పూణేలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు పులుల బారి నుంచి తమను కాపాడుకునేందుకు ఓ వైరైటీ ఆలోచన చేశారు. అదేంటంటే.. మొలలతో తయారు చేసిన ఓ ఆభరణాన్ని మెడకు కట్టుకున్నారు. దీంతో తమను తాము రక్షించుకోగలగుతామంటున్నారు. పొలాలకు, మార్నింగ్ వాకింగ్ వెళుతున్న వారిపై పులులు దాడులు చేస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. నైట్ , ఉదయం ఎప్పుడు బయటకు వెళ్లినా వీటిని కచ్చితంగా ధరించి తమను తాము రక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. పులులు సాధారణంగా మొదటగా దాడి చేసేది మెడ భాగంలోనే కాబట్టి.. మెడపై మొలల ఉండడంతో వాటని కొరకగానే… పులికి గాయాలు అవుతాయి. దీంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని… ఈ విన్నూత ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే వీడియో చూసిన నెటిజన్లు అంతా.. వాట్ ఎన్ ఐడియా సర్ జీ అంటూ.. కామెంట్లు పెడతారు. ప్రభుతం ప్రజలను రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.