Rahul Gandhi: “టికెట్ టూ డిజాస్టర్”.. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై బీజేపీ కార్టూన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: 2024 లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఉండనున్నారు. అయితే ఇండియా కూటమి మాత్రం ఇప్పటి వరకు ప్రధాన మంత్రి అభ్యర్థిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ అని చెబుతోంది. ఇలా కాంగ్రెస్ రాహుల్ గాంధీ పేరును ప్రకటించడంతో అధికార బీజేపీ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు పేలుస్తోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఓ కార్టూన్ రిలీజ్ చేసింది.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
రాహూల్ గాంధీ విమానంలో ఎగురుతున్నట్లు కార్టూన్ లో ఉంది. ‘‘బ్రాండ్ న్యూ(ఓల్డ్), హాట్ ఎయిర్ ఇండియా- టికెట్ టూ డిజాస్టర్’’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని రాజస్తాన్ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ ప్రకటించిన తర్వాత బీజేపీ ఈ కార్టూన్ పోస్ట్ చేసింది. ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన గెహ్లాట్.. కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ అంటూ ప్రకటించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారని, ఎటువంటి సమస్య లేదని గెహ్లాట్ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ, ఆప్ వంటి పార్టీలు మొత్తం 26 పార్టీలు ఇండియా పేరుతో ఓ కూటమిని ఏర్పాటు చేశాయి. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ కలిసి ఉమ్మడిగా పోటీ చేయబోతున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఈ కూటమిని అవినీతి కూటమిగా అభివర్ణిస్తోంది. మరోవైపు ఇండియా కూటమి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కూటమిగా పోరాడుతున్నామని చెబుతోంది.
Congress announces Rahul Gandhi as it’s Prime Ministerial candidate… pic.twitter.com/hFPbo8ERzI
— BJP (@BJP4India) August 28, 2023
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!