Rahul Gandhi: 2024 లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఉండనున్నారు.
దేశంలోని విపక్ష పార్టీలన్నీ కలిసి కూటమికి I.N.D.I.A అని పేరును పెట్టుకోవడం తెలిసిందే. అయితే ఆ పేరును తప్పుడు ప్రచారంగా వాడుకుంటున్నట్లు పోలీస్ కేసు నమోదైంది. I-N-D-I-A పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని బరాఖంబ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.