NTV Telugu Site icon

Rahul Gandhi: “టికెట్ టూ డిజాస్టర్”.. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై బీజేపీ కార్టూన్..

Rahul Ghandi

Rahul Ghandi

Rahul Gandhi: 2024 లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఉండనున్నారు. అయితే ఇండియా కూటమి మాత్రం ఇప్పటి వరకు ప్రధాన మంత్రి అభ్యర్థిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ అని చెబుతోంది. ఇలా కాంగ్రెస్ రాహుల్ గాంధీ పేరును ప్రకటించడంతో అధికార బీజేపీ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు పేలుస్తోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఓ కార్టూన్ రిలీజ్ చేసింది.

READ ALSO: Blue Supermoon: ఆకాశంలో అద్భుతం.. “బ్లూ సూపర్‌మూన్”గా చంద్రుడు .. ఇప్పుడు చూడకుంటే 2037 వరకు ఆగాల్సిందే..

రాహూల్ గాంధీ విమానంలో ఎగురుతున్నట్లు కార్టూన్ లో ఉంది. ‘‘బ్రాండ్ న్యూ(ఓల్డ్), హాట్ ఎయిర్ ఇండియా- టికెట్ టూ డిజాస్టర్’’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని రాజస్తాన్ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ ప్రకటించిన తర్వాత బీజేపీ ఈ కార్టూన్ పోస్ట్ చేసింది. ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన గెహ్లాట్.. కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ అంటూ ప్రకటించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారని, ఎటువంటి సమస్య లేదని గెహ్లాట్ అన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ, ఆప్ వంటి పార్టీలు మొత్తం 26 పార్టీలు ఇండియా పేరుతో ఓ కూటమిని ఏర్పాటు చేశాయి. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ కలిసి ఉమ్మడిగా పోటీ చేయబోతున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఈ కూటమిని అవినీతి కూటమిగా అభివర్ణిస్తోంది. మరోవైపు ఇండియా కూటమి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కూటమిగా పోరాడుతున్నామని చెబుతోంది.