Bomb Threat: వేలాది కసబ్‌లు పుట్టుకొస్తారు.. కర్ణాటక సీఎం, పాస్‌పోర్ట్ ఆఫీస్కి బాంబు బెదిరింపు..
- బెంగళూరులోని పాస్‌పోర్ట్ కార్యాలయానికి బాంబు బెదిరింపు..
- సవుక్కు శంకర్, కసబ్ లను అక్రమంగా అరెస్టు చేశారని వెల్లడి..
- పాస్‌పోర్ట్ కార్యాలయంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat: బెంగళూరులోని కోరమంగళలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి ఈరోజు (జూన్ 6న) బాంబు బెదిరింపు వచ్చింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో వచ్చిన ఒక ఇ-మెయిల్, పాస్‌పోర్ట్ ఆఫీసుతో పాటు ముఖ్యమంత్రి నివాసం రెండింటినీ లక్ష్యంగా చేసుకుని IEDలు కలిగిన ఆత్మాహుతి బాంబర్ల గురించి అందులో పేర్కొనింది. ఈ సందేశంలో ఈ దాడి ఈరోజు మధ్యాహ్నం 3:15 గంటలకు జరగనుందని హెచ్చరించింది. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ పోలీసులకు కూడా పంపబడిన ఈ ఇ-మెయిల్, “విదుతలై పులి” అని పిలుచుకునే ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొంది. అందులో, మతపరమైన అంశాలను ప్రస్తావించడంతో పాటు సవుక్కు శంకర్, కసబ్ లాంటి వ్యక్తులను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.
Also Read
అయితే, ఆ ఇ-మెయిల్ లో “మా సోదరుడి (కసబ్)ని మైనర్‌గా భావించి కేవలం విచారణ చేసి వదిలి పెట్టాలి.. కానీ, ప్రపంచ మానవ హక్కుల సంఘాల సానుభూతి పొందాలని భారత వ్యవస్థ కోరుకుంది.. అతన్ని జన్నాకు చేరేలా చేసింది” అని రాసుకొచ్చారు. భారత్ చేసిన ఈ తప్పులతో ఇప్పుడు, 1000 మంది కసబ్‌లు, సవుక్కు శంకర్‌లు వెలుగులోకి వస్తారని పేర్కొన్నారు. అలాగే, తమిళనాడు మెత్ ఆపరేషన్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కిరుతిగ ఉదయనిధితో సహా ఇతర వ్యక్తులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ఇ-మెయిల్లో డిమాండ్ చేశారు.
Read Also: Indiramma Indlu : ఇక పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు
ఇక, ఆ ఇ-మెయిల్‌లో RFID ఆధారిత పేలుడు పదార్థాలు, మానవ ఆత్మాహుతి బాంబర్లను ఉపయోగిస్తామని వారు పేర్కొన్నారు. బాంబు బెదిరింపు సమాచారం అందిన వెంటనే కోరమంగళ పోలీసులు పాస్‌పోర్ట్ కార్యాలయానికి చేరుకుని.. ప్రస్తుతం అక్కడ ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. పాస్ పోర్టు ఆఫీసులో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో సైతం భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!