యమునా నది విషపు నురుగుతో పోరాడుతుంది. యమునా నదిలో నడుము లోతు వరకు విషపూరితమైన నురుగుతో నిలబడిన భక్తుల షాకింగ్ చిత్రాలు, వీడియోలు ప్రతి సంవత్సరం ముఖ్యాంశాలుగా మారుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా దీనికి భిన్నంగా ఏం లేదు. సోమవారం, కలుషితమైన నదిలో మహిళలు కార్వా చౌత్ సంద ర్భంగా స్నానం చేస్తున్న అనేక క్లిప్‌లు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేశా యి. అయితే, ఈ ఏడాది విషపూరిత నురుగు సమస్యకు ఢిల్లీ జల్ బోర్డు తాత్కాలిక పరిష్కారాన్ని చూపింది. ఒక కార్మికుడు నది ఒడ్డు నుండి నురుగును పొగొట్టేందుకు యమునా నదిపై నీటిని చిలకరి స్తున్నాడు ఆ కార్మికుడు అశోక్ కుమార్‌గా గుర్తించారు. అతడు రోజంతా అలానే చేయాలని ప్రత్యేకంగా అధికారులు ఆదేశించారు.
ఇప్పటికే యమునా నదిలో కాలుష్యా స్థాయి విపరీతంగా పెరిగి పోయింది. దీని కారణంగా ఢీల్లీ ప్రజలకు నీటి సరఫరాను కూడా బంద్ చేశా రు. ఢీల్లిలోని కర్మాగారాల నుంచి వచ్చే కాలుష్యపు నీరంతా యమునా నదిలోనే కలుస్తుంది. దీంతో యుమనా నదిలో విపరీతంగా కాలుష్య స్థాయి పెరిగిపోయింది. ప్రభుత్వాలు దీనిపై ఇప్పటి వరకు కాలుష్య స్థాయిలను నివారించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్టు కనిపించడం లేదని అక్కడి స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.