Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News The Success Story Of Renuka Aradhya Owner Of Pravasi Who Begged For Survive

Renuka Ardhya: ఫ్యామిలీ కోసం భిక్షాటన.. ఇప్పుడు బిలియనీర్.. 1000 కార్లు, వేల సంఖ్యలో ఉద్యోగులు

Published Date :December 12, 2023 , 3:54 pm
By snehalatha
Renuka Ardhya: ఫ్యామిలీ కోసం భిక్షాటన.. ఇప్పుడు బిలియనీర్.. 1000 కార్లు, వేల సంఖ్యలో ఉద్యోగులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

సాధించాలనే పట్టుదల ఉంటే అసాధ్యమనేది ఉండదని పెద్దవాళ్లు చెబుతుంటారు. అది నిజమని ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కూడా రుజువు చేశారు. జీవితంలో సక్సెస్ అయిన ప్రతి బిజినెస్ మ్యాన్ మొదట చెప్పే మాట కూడా ఇదే. తాజాగా మరోసారి దీన్ని రుజువు చేశాడు కర్ణాటకకు చెందిన రేణుకా ఆరాధ్య. ‘పెదవాడిగా పుట్టడం నీ కర్మఫలం కావచ్చు.. కానీ అదే పేదవాడిగా చనిపోతే మాత్రం నీ తప్పే అవుతుంది’ అని ఓ కవి చెప్పిన మాటను రేణుకా ఆరాధ్య బాగా ఫాలో అయ్యాడు. ఆ సక్సెస్ మంత్రతో పట్టుదలతో బిక్షగాడి నుంచి బిలియనీర్‌గా ఎదిగాడు. మరి ఇందుకోసం రేణుకా ఆరాధ్య పాటించిన సక్సెస్ మంత్ర ఏంటో ఈ స్టోరీలో చదవండి!

కుటుంబం కోసం భిక్షాటన
రేణుకా ఆరాధ్యది ఓ పేద కుటుంబం. కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో వారు నివసించేవారు. కనీసం మూడు తినడానికి కూడా తిండి ఉండేది కాదు. అలాంటి పేదరికంలోనూ రేణుకా ఆరాధ్య పదో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దయనీయంగా మారడంతో చదువు మానేసి కుటుంబం కోసం భిక్షాటన చేశాడు. ఇంటింటికీ వెళ్లి బియ్యం, పప్పు, పిండి కోసం అడుక్కోవాల్సి వచ్చింది. డబ్బుల కోసం ఇళ్లల్లో పని చేసేవాడు. అలా వచ్చే డబ్బు సరిపోకవడంతో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం సంపాదించాడు. దానితో పాటు ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరిలో కూడా ఉద్యోగిగా చేరాడు.

పట్టుదల కోసం పెళ్లి..
అదే సమయంలో రేణుకా ఆరాధ్యకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది.పెళ్లయితే కుటుంబ బాధ్యత పెరిగి తనలో ఇంకా పట్టుదల పెరుగుతుందని నమ్మి.. 20 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నాడు. సూట్‌కేసు కవర్స్ వ్యాపారం మొదలు పెట్టాడు. దానిలో నష్టం రావడంతో అప్పుల పాలు అయ్యాడు. అది తీర్చడం కోసం ఓ ట్రావెల్ ఎజెన్సీలో డ్రైవర్‌గా చేరాడు. అలా నాలుగు సంవత్సరాలు డ్రైవర్‌గా పని చేసిన రేణుకా ఆరాధ్యకు సొంతగా ట్రావెల్ ఏజెన్సీ నడపాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ప్రవాసీ క్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక్క కారుతో వ్యాపారం మొదలు పెట్టాడు. మరుసటి ఏడాదికి మరో కారు కొన్నాడు.

ఇంతలో ఓ ట్రావెల్ ఏజెన్సీ తన వ్యాపారాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దింతో 6 లక్షలకు రేణుకా ఆరాధ్య ఆ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. ఆ సమయంలో కంపెనీకి 35 క్యాబ్‌లు ఉండేవి. అలా మొదలైన తన ట్రావెట్ బిజినెస్ మెల్లిమెల్లిగా లాభాలు చూపించింది. దీంతో అమెజాన్ ఇండియా ప్రమోషన్ కోసం అతడి కంపెనీని ఎంచుకుంది. వాల్‌మార్ట్ అండ్ జనరల్ మోటార్స్ వంటి కంపెనీలు కూడా వారితో కలిసి పనిచేయడం ప్రారంభించాయి. క్రమంగా కంపెనీ టర్నోవర్ పెరగి.. అతడి సంపాదన రూ.40 కోట్లు వరకు చేరుకుంది. అలా నేడు రేణుకా ఆరాధ్య బిలియనీర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం అతడి దగ్గర 1000 కార్లు ఉండగా అందులో 250 కార్లు అతడి సొంతం కొన్నవే. ఇక వేల సంఖ్యలో ఉద్యోగులు అతడి దగ్గర పని చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Beggar Became Billionaire
  • karnataka
  • national news
  • Renuka Aradhya
  • Success Story Of Renuka Aradhya

తాజావార్తలు

  • Harish Rao: ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతోంది.. మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

  • Shobha Karandlaje: ఏప్రిల్ 17 భారత మహిళలకు బ్లాక్ డే.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..

  • Silver Purity: పాపం తెలుసా.. వెండి కొంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారంట! ఎలాగో తెలుసా?

  • IPL Record: ఐపీఎల్ కింగ్ కోహ్లీ కాదు.. ఎవరో తెలుసా? విస్తుపోయే గణాంకాలు..

  • Chanakya Niti: విలువల ముసుగులో మోసపోకండి! ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో నేర్పిస్తున్న చాణక్య నీతి

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions