2024 సంవత్సరం మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. 2025 కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు దేశమంతా సిద్ధమవుతోంది. అయితే ఈ ఏడాది పొలిటికల్‌గా కొన్ని రికార్డ్‌లు నమోదయ్యాయి. వయనాడ్‌లో ప్రియాంకాగాంధీతో సహా పిఠాపురంలో పవన్‌కల్యాణ్ వరకు ఎందరో ప్రముఖులు ఎన్నికల్లో గెలిచారు. వాళ్లంతా ఎవరో రివైండ్ చేసుకుందాం.
1. ప్రియాంకాగాంధీ
రాజీవ్ గాంధీ, సోనియా దంపతుల కుమార్తె, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోదరీగా ప్రియాంకాగాంధీ ఈ ఏడాది రాజకీయ అరంగ్రేటం చేశారు. అప్పటి వరకు ఎన్నికల ప్రచారానికే పరిమితమైన ప్రియాంక.. గత నవంబర్‌లో జరిగిన వయనాడ్ లోక్‌సభ బైపోల్ ద్వారా రాజకీయ ప్రవేశం.. ఆరంభంలోనే అదరగొట్టారు. ఏకంగా నాలుగు లక్షలకు పైగా మెజార్టీతో ప్రియాంక గెలిచి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ.. రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేసి భారీ విజయంతో రెండు చోట్ల గెలిచారు. అయితే వయనాడ్ వదులుకుని రాయ్‌బరేలీ స్థానాన్ని ఉంచుకున్నారు. దీంతో వయనాడ్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది.
2. కల్పనా సోరెన్
కల్పనా సోరెన్.. ఈ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. కల్పనా సోరెన్.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి. హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో జనవరిలో జైలుకెళ్లారు. దీంతో ముఖ్యమంత్రిగా కల్పనా సోరెన్ కాబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే తోడి కోడలు సీతా సోరెన్ అడ్డుపడడంతో.. సీఎం కుర్చీ దూరమైంది. అనంతరం అసెంబ్లీ బైపోల్‌లో కల్పనా సోరెన్ విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇక నవంబర్‌లో జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరోసారి గాండే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తీవ్ర కృషి చేశారు.
3. కంగనా రనౌత్
కంగనా రనౌత్ బాలీవుడ్ నటి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఘనవిజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అరంగేట్రంలోనే భారీ విక్టరీ అందుకున్నారు.
4. పవన్‌కల్యాణ్
పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ అధినేత. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. పీఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం డిప్యూటీ సీఎంగా పవన్‌కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. చంద్రబాబు కేబినెట్‌లో జనసేనకు చోటు దక్కింది.
5. నారా లోకేష్
నారా లోకేష్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అలాగే తండ్రి చంద్రబాబు కేబినెట్‌లో ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక అంతకముందు ఏపీ అంతటా పాదయాత్ర చేసి.. పార్టీ అధికారంలోకి రావడానికి తీవ్ర కృషి చేశారు.
6. బన్సూరీ స్వరాజ్
బన్సూరీ స్వరాజ్.. సుష్మా సర్వాజ్ కుమార్తె. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. తొలిసారి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. తల్లి రాజకీయ వారసురాలిగా బన్సూరీ స్వరాజ్ అరంగ్రేటంలో అదరగొట్టారు. మంచి విక్టరీతో పార్లమెంటలోకి అడుగుపెట్టారు.
7. భరత్
భరత్.. సినీ నటుడు బాలకృష్ణ చిన్న అల్లుడు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ విజయంతో గెలుపొందారు. తొలిసారి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. విశాఖలో గీతం యూనివర్సిటీ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు.