విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్’. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి. వరుస పరాజయాల తర్వాత విజయ్ దేవరకొండ నుండి ఒక హిట్ సినిమా రాబోతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
Also Read : Court : ‘కోర్ట్’ సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తున్న ‘టాప్ స్టార్’
ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెడుతోంది కింగ్‌డమ్. ఈ నేపధ్యంలో నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది కింగ్‌డమ్. రొటీన్ రెగ్యులర్ కథ కాకుండా ఒక డిఫ్రెంట్ కథతో వస్తున్న కింగ్‌డమ్ టీమ్ ను అభినందిచారట సినిమా వీక్షించిన సెన్సార్ సభ్యులు. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ నటన పట్ల సెన్సార్ సభ్యుల సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిందట. అయితే సినిమాలో కాస్త వైలెన్స్ ఎక్కవగా ఉందని, అలాగే లిప్ లాక్స్ వంటివి ఉండడంతో సెన్సార్ టీమ్ నుండి U/A సర్టిఫికెట్ ను జారీ చేసారు. అలాగే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ను మ్యూట్ చేశారట. మరోవైపు కింగ్‌డమ్ ట్రైలర్ మరికొన్ని కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను నేడు తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు మేకర్స్. విజయ్ దేవరకొండతో పాటు యూనిట్ మొత్తం ఈ వేడుకకు హాజరుకాబోతున్నారు. అందుకు తిరుపతి నెహ్రు మున్సిపల్ స్టేడియం వేదిక కానుంది.