PM Modi: దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్కే పురంలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో స్పోర్ట్స్ యూనివర్శిటీ పేరుతో ఆప్ ఏం చేసిందో ఢిల్లీ వాసులకు, యువతకు బాగా తెలుసు అన్నారు. ఇప్పటికే, ఆప్ పాలనతో దేశ రాజధానిలో 11ఏళ్ల సమయం వృథా అయిందని విమర్శలు గుప్పించారు. అందుకే ఇక్కడి యువత బీజేపీతోనే ఉంది.. మేము అధికారంలోకి వస్తే మురికివాడలను కూల్చివేయమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే కాంగ్రెస్, ఆప్ ఈలాంటి పుకార్లు వ్యాపింపజేస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో ఎలాంటి ప్రజా సంక్షేమ పథకాలు బందు చేయమని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
Read Also: Prism Pub Firing Case : గచ్చిబౌలి ప్రిజం పబ్బు కాల్పుల కేసులో కీలక అంశాలు
అలాగే, ఆమ్ ఆద్మీ నేతలు పార్టీని వీడుతున్నారు.. ప్రజల్లో పార్టీపై ఎంత ఆగ్రహం ఉందో వారు గ్రహించారని ప్రధన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈసారి దేశ రాజధాని ఢిల్లీ డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడుతుందని అతడు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ నెల 8వ తేదీన కాషాయ పార్టీ విజయం సాధిస్తుంది.. వచ్చే నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళలకు రూ.2500 పంపిణీ ప్రారంభిస్తామని మోడీ చెప్పుకొచ్చారు. అలాగే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌పై కూడా ప్రశంసలు కురిపించారు. ఈ బడ్జెట్ మధ్య తరగతి ప్రజలదని కొనియాడారు. కొత్త బడ్జెట్‌తో మిడిల్ క్లాస్ ప్రజలకు అవసరమయ్యే రోజువారీ వస్తువులు మరింత తక్కువ ధరకే దొరుకుతాయని నరేంద్ర మోడీ వెల్లడించారు.