Operation Akhal: కుల్గాంలో ఎన్‌కౌంటర్.. మరో ఉగ్రవాది హతం
- కుల్గాంలో ఎన్‌కౌంటర్
- మరో ఉగ్రవాది హతం
- ఇటీవల పహల్గామ్ ఉగ్రవాదులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సైన్యం ముష్కరుల భరతం పడుతోంది. ఒక్కొక్కరిని ఏరివేస్తోంది. ఇటీవల శ్రీనగర్‌లో ఆపరేషన్ మహాదేవ్ చేపట్టి ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. పహల్గామ్ కీలక సూత్రదారి సులేమాన్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తాజాగా శనివారం ఆపరేషన్ అఖల్ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
ఇది కూడా చదవండి: Kalabhavan Navas: మలయాళ నటుడు కళాభవన్ నవాస్ అనుమానాస్పద మృతి!
Also Read
- Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని అఖల్ ప్రాంతంలో భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమైనట్లు భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ శనివారం తెలిపింది. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Pregnant women : తల్లి అయ్యే ముందు తెలుసుకోవలసిన 5 ముఖ్యమైన విషయాలు !
శుక్రవారం అఖల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు తిష్ట వేసినట్లు సైన్యానికి పక్కా సమాచారం అందింది. దీంతో శనివారం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సైన్యం కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా.. మరికొందరి కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: OG : పాట లీక్.. సుజీత్ కొంప ముంచిన థమన్ !
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు.. 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. అనంతరం భారత ప్రభుత్వం.. మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఇక జూలై 28న ఆపరేషన్ మహాదేవ్‌లో పహల్గామ్ ఉగ్రవాదులు హతం అయ్యారు.
OP AKHAL, Kulgam
Contact established in General Area Akhal, Kulgam. Joint Operation in progress.#Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/d2cHZKiC61
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) August 1, 2025
తాజావార్తలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
-
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
ట్రెండింగ్
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!