పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత సైన్యం ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. పహల్గామ్ ఉగ్రవాదులు సహా పలువురు హతమయ్యారు.
Operation Akhal: శుక్రవారం జమ్మూ కాశ్మీర్ కుల్గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఎన్‌కౌంటర్ ‘‘ఆపరేషన్ అఖల్’’లో భాగంగా జరిగింది. ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)తో అనుబంధంగా ఉన్నారని మరియు ఇటీవలి పహల్గామ్ దాడితో సంబంధం కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సైన్యం ముష్కరుల భరతం పడుతోంది. ఒక్కొక్కరిని ఏరివేస్తోంది. ఇటీవల శ్రీనగర్‌లో ఆపరేషన్ మహాదేవ్ చేపట్టి ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు.