Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Terrorist Abdul Rehman Makki Dies Lahore Unknown Men Mystery

Un Known Men: పాకిస్తాన్‌లో “ధురంధరులు”, ఎంత మంది ఉగ్రవాదుల్ని పైకి పంపారో తెలుసా..

Published Date :March 22, 2026 , 6:30 pm
By Venu Goapl Reddy
  • ‘‘గుర్తు తెలియని వ్యక్తుల’’కు వణికిపోతున్న పాక్ టెర్రరిస్టులు..
  • ధురంధరుల చేతిలో హతమవుతున్న భారత్ వ్యతిరేకులు..
Un Known Men: పాకిస్తాన్‌లో “ధురంధరులు”, ఎంత మంది ఉగ్రవాదుల్ని పైకి పంపారో తెలుసా..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Un Known Men: పాకిస్తాన్‌లో మన ‘‘ధురంధరులు’’ రెచ్చిపోతున్నారు. అక్కడి ఉగ్రవాదులు, ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వారు, భారత వ్యతిరేకులు వరసగా ‘‘గుర్తుతెలియని వ్యక్తుల’’ చేతిలో హత్యకు గురవుతున్నారు. ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్‌లో ఇప్పుడు వారు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. గత కొంత కాలంగా పాకిస్తాన్‌లోని ఏ ప్రావిన్సులో నక్కినా కూడా ఉగ్రవాదులు ఖతమైపోతున్నారు. కరాచీ, లాహోర్, పెషావల్, డేరా ఘాజీ ఖాన్, క్వెట్టాలలో ఎక్కడ ఉన్నా గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో ఉగ్రవాదుల ఖతమవుతున్నారు.

తాజాగా లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ బావమరిది అబ్దుల్ రెహమాన్ మక్కీ శుక్రవారం గుండెపోటుతో లాహోర్‌లో మరణించాడు. డయాబెటిస్‌తో బాధపడుతున్న మక్కీ గత కొంత కాలంగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించినట్లు లష్కరే అనుబంధ సంస్థ జమాత్ ఉద్ దావా ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఇతడి మరణం వెనక కూడా ‘‘గుర్తు తెలియని వ్యక్తులు’’ ఉన్నారనే ప్రచారం ఉంది.

Also Read

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
  • TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
  • Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్‌కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
  • Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
Add as a preferred
source on google

రహమాన్ మక్కీ 2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత అమెరికా, ఐక్యరాజ్య సమితి చేత ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించబడ్డాడు. అరబిక్ మరియు ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం ఉన్న ఆయన, సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్న ఉమ్ అల్-ఖురా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. అయితే, ముంబై ఉగ్రవాద దాడుల్లో మక్కీ ప్రమేయం ప్రత్యక్షంగా ఉన్నా కూడా పాకిస్తాన్ ఎప్పుడూ ఒప్పుకోలేదు. సయీద్‌తో కలిసి కాశ్మీర్‌ పేరుతో భారత్‌కు వ్యతిరేకంగా జిహాద్‌ను మక్కీ ప్రోత్సహించాడు.

గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమైన ఉగ్రవాదులు వీరే:

* భారతదేశానికి చెందిన సరబ్‌జీత్ సింగ్‌ని పాకిస్తాన్ జైలులో చంపిన పాకిస్తాన్ అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్‌ని గుర్తు తెలియని వ్యక్తులు 2024లో కాల్చి చంపారు. లాహోర్‌లో ఇద్దరు వ్యక్తులు అతి సమీపం నుంచి షూట్ చేయడంతో అమీర్ హతమయ్యాడు.

*నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన మహ్మద్ ముజామిల్, నయీమూర్ రెహ్మన్‌లను సియాల్‌కోట్ నగరంలో హతమార్చారు. పోలీస్ యూనిఫాం ధరించిన ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కాల్చి చంపారు. ఈ ఘటన 2023 నవంబర్‌లో జరిగింది.

*2023లో జైషే ఉగ్రవాది మసూద్ అజార్ కి అత్యంత సన్నిహితుడైన మౌలానా రహీం ఉల్లా తారిఖ్‌ని కరాచీలో గుర్తు తెలియని వ్యక్తుల కాల్చి చంపారు. అంతకుముందు జమ్మూలోని సుంజువాన్ ఆర్మీ క్యాంప్‌పై 2018 దాడికి సూత్రధారి అని నమ్ముతున్న ఖ్వాజా షాహిద్ అనే ఉగ్రవాదిని పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK) లో కిడ్నాప్ చేసి, తల నరికి చంపేశారు. అక్టోబరులో, మసూద్ అజార్ యొక్క విశ్వసనీయ సభ్యుడిగా కూడా పరిగణించబడే దౌద్ మాలిక్, వజీరిస్థాన్‌లో పట్టపగలు హత్య చేయబడ్డాడు. వీరే కాకుండా జమాతే ఉద్ దావా, లష్కర్ ఉగ్రవాది హఫీస్ సయీద్ అత్యంత సన్నిహితుడు మాలిక్, ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ని కూడా గత నెలలో ఇలాగే హత్యలు చేశారు.

* 2025లో పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ)లో క్రియాశీల సభ్యుడు, కమాండర్‌గా ఉన్న షేక్ మోయిజ్ ముజాహిద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులోని కసూర్ సిటీలో ముజాహిద్ ఇంటి వెలుపల ఈ సంఘటన జరిగింది.

* 2025లో పాక్‌లోని దిర్‌లో భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సన్నిహితుడు ముఫ్తీ హబీబుల్లా హక్కానీని అతిదగ్గర నుంచి కాల్చి చంపారు.

* 26/11 ముంబై దాడులకు కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రసంస్థ అధినేత హఫీజ్ సయీద్ బంధువు, లష్కరే తోయిబా నిధుల సేకరణకు సంబంధించిన ఖారీ షాజాదాను 2025లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కరాచీ నగరంలోని ఖైరాబాద్ ప్రాంతంలోని జామియత్ ఉలేమా ఇస్లాం అనే సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న ఖారీ షాజాద్‌ని స్థానిక మసీదు సమీపంలో కాల్చి చంపారు.

* టెర్రరిస్ట్ జహూర్ మిస్త్రీ, ఐసీ-814 విమానం హైజాక్ లో కీలకంగా పాల్గొన్న ఉగ్రవాదిని 2022లో కరాచీలో కాల్చి చంపారు. అబూ సైఫుల్లా కాలిద్ 2006లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్‌పై దాడి చేశాడు, ఇతడిని 2025లో అన్ నోన్ వ్యక్తులు హతం చేశారు. హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవి, ముంబై దాడుల్లో కీలకంగా వ్యవహరించిన ఇతడు 2023లో జైలులో మరణించాడు

*2025లో లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రసంస్థకు ఫైనాన్షియర్‌గా, 26/11 ఉగ్రవాదుల సూత్రధారి హఫీస్ సయీద్ సన్నిహితుడిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మృతుడిని అబ్దుల్ రెహమాన్‌గా గుర్తించారు.

* వీరే కాకుండా 2023 కరాచీలో లష్కర్ ఉగ్రవాది రియాజ్ అహ్మద్ హతమ్యాడు, జియా ఉర్ రెహ్మాన్ ను కరాచీలో 2023లో చంపేశారు. నూర్ అహ్మద్ ను 2024 కరాచీలో చంపేశారు. షహీద్ లతీఫ్ అనే జైషే ఉగ్రవాదిని సియాల్ కోట్ మసీదులో కాల్చి చంపారు. అబూ కాసిమ్ కాశ్మీరీ అనే ఉగ్రవాదిని రావల్పిండితో గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abdul Rehman Makki Death
  • Hafiz Saeed
  • India's Enemies Targeted in Pakistan
  • Lahore
  • Lashkar-e-Taiba Leaders Killed

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions