జమ్మూ- కశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల చొరబాట్లు బాగా తగ్గాయి. అయినప్పటికీ, ప్రస్తుతం పాక్ నుంచి 200 మంది ముష్కరులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. కశ్మీర్ సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి భద్రతా పరిస్థితులను ఆయన వివరించారు. పర్వత ప్రాంతాలు, అడవుల గుండా మాత్రమే కాకుండా జమ్మూ, పంజాబ్, నేపాల్ మీదుగానూ చొరబాట్లు జరుగుతున్నాయన్నారు. అయితే.. వాటిని అడ్డుకునే యంత్రాంగం పటిష్ఠంగా ఉందని, అన్ని…