Site icon NTV Telugu

Pahalgam Terror Attack: కరాచీ, ముజఫరాబాద్‌లో ఉగ్రవాద హ్యాండర్లు.. పాక్ ప్రమేయంపై సంచలన ఆధారాలు..

Pak

Pak

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన కీలక సూత్రధారులు పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ సంస్థలు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద నెట్వర్క్ ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోరెన్సిక్, నిఘా, భద్రతా సంస్థల సంయుక్త దర్యాప్తులో ఆపరేషన్‌కి సంబంధించిన పాక్ ప్రమేయాన్ని సూచిస్తున్నాయి.

డిజిటల్ ఫుట్‌ఫ్రింట్స్, ఫోరెన్సిక్ దర్యాప్తు పాకిస్తాన్ నుంచే ఈ దాడిని నిర్వహించినట్లు వెల్లడిస్తున్నాయి. దాడి చేసిన ఉగ్రవాదులు మిలిటరీ గ్రేడ్ ఆయుధాలు, అధునాతన కమ్యూనికేషన్ వ్యసస్థల్ని ఉపయోగించారు. ఇది కఠిన శిక్షణ, ఖచ్చితమైన ప్రణాళికల్ని సూచిస్తోంది. ఆయుధాలు వినియోగించడం, ఖచ్చితత్వంలో దాడులకు పాల్పడటం చూస్తే, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థల కుట్ర తెలుస్తోంది.

Read Also: KL Rahul: మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్..! కెఎల్ రాహుల్ – గోయెంకా మధ్య “కోల్డ్ వార్”..?

ఇంటెలిజెన్స్ సంస్థలు దాడి చేసిన వారు పాకిస్తాన్‌లో ఉన్న సూత్రధారులు, ఉగ్రవాద కార్యకర్తలతో ప్రత్యక్ష సంభాషణల్ని ఇంటర్‌సెప్ట్ చేశాయి. సాంకేతిక నిఘా ఆధారంగా ముజఫరాబాద్, కరాచీ నుంచి ఉగ్రవాదులకు సంబంధాలు ఉన్నట్లు తేలింది. కాశ్మీర్‌లో జనాభా స్వరూపాన్ని మార్చాడానికి ప్రతీకారంగా ఈ హత్యలు జరిగినట్లు ఉగ్రవాద సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇది కేవలం ఒక ఉగ్రవాద దాడిగా మాత్రమే చూడలేమని, దీనిని పాకిస్తాన్ నుంచి దిశానిర్దేశం చేశారని, ఆయుధాలు, మద్దతు ఇచ్చినట్లు ఒక సీనియర్ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల హ్యాండర్లు పాకిస్తాన్‌ లోనే ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి.

Exit mobile version