సహజంగా ఈశాన్య రాష్ట్రాల ప్రజల కన్నులు చాలా చిన్నగా ఉంటాయి. వీటిపై దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కామెంట్లు చేస్తుంటారు. అయితే తన చిన్న కళ్ల గురించి నాగాలాండ్ మంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు టెమ్ జెన్ ఇన్మా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన హాస్యానికి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఇంతలా హస్యం పంచిన వీడియోలో ఏముందంటే.. నాగాలాండ్ ఉన్నత విద్య, గిరిజన వ్యవహారాల మంత్రి టెన్ జెన్ ఇన్మా ఓ బహిరంగ ప్రసంగంలో తన చిన్న కళ్లపై తానే సెటైర్లు వేసుకున్నారు. చిన్న కళ్లతో ఉన్న ప్రయోజనాలను గురించి వివరించారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల కళ్లు చిన్నగా ఉంటాయని చాలా మంది అంటుంటారని.. అయితే వారికి చిన్న కళ్లు ఉంటాయి.. కానీ వారి దృష్టి పదునైనదని అన్నారు. చిన్న కళ్లు ఉంటే బయటనుంచి వచ్చే దుమ్ము, ధూళి కళ్లలోకి చేరదని అన్నారు. ఒక వేళ ఏదైనా సమావేశంలో స్టేజీపై కూర్చున్నప్పుడు నిద్ర పోయిన ఎవరూ గుర్తించలేరని వ్యాఖ్యానించారు.
Read Also: Cono Corpus: ఈ మొక్కను ఇంట్లో పెంచుతున్నారా? ప్రాణాలు కాపాడుకోండి
ఈ వీడియోను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా షేర్ చేశారు. మంత్రి వ్యాఖ్యలకు ఫిదా అయిన నెటిజెన్లు ఈ వీడియోను తెగ వైరల్ చేశారు. ఈశాన్య ప్రజల వాణిని ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు టెమ్ జెన్ ఇన్మా నెటిజన్లకు ధన్యవాదాలు తెలిపారు.
My brother @AlongImna is in full form https://t.co/5IvgpYEuts
— Himanta Biswa Sarma (@himantabiswa) July 8, 2022