BJP-Congress: 2024 లోకసభ ఎన్నికల ముందు జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా అంతా ఆసక్తి నెలకొంది. ఈ రోజు మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. దాదాపుగా మూడు రాష్ట్రాలు బీజేపీ ఖాతాలో చేరబోతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీ అధికారం సాధించే అవకాశం కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో గిరిజన ఓట్లను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. మధ్యప్రదేశ్ గిరిజన ఓట్లలో కూడా కాంగ్రెస్‌కి కోత పడింది.
Read Also: Congress Victory: రామగుండంలో కాంగ్రెస్ విజయం
మధ్యప్రదేశ్‌లో రెండు దశాబ్ధాలుగా బీజేపీ అధికారంలో ఉంది. మరో 5 ఏళ్లు కూడా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. మొత్తం 230 స్థానాలకు గానూ బీజేపీ ఇప్పటికే 163 సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 65 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 90 నియోజవర్గాల్లో ప్రస్తుతం బీజేపీ 53 స్థానాల్లో, కాంగ్రెస్ 36 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక రాజస్థాన్ రాష్ట్రంలో 199 స్థానాల్లో బీజేపీ 113 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది, కాంగ్రెస్ 70 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
