Site icon NTV Telugu

ED Raids: టార్గెట్‌ మహా సర్కార్‌..? ఈడీ రైడ్స్‌ కలకలం..

మహారాష్ట్ర ప్రభుత్వంలోని నేతలను కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌ చేస్తోందా? అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి.. వరుసగా జరుగుతోన్న ఘటనలు.. మొన్న మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌… నిన్న మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ జైలుకు పంపింది. తాజాగా ముఖ్యమంత్రి, శివసేన చీఫ్‌ ఉద్ధవ్​ ఠాక్రే బంధువు కార్యాలయాలపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ దాడులు చేసింది. మనీలాండరింగ్​ కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించిన ఈడీ.. ఠాణెలోని నీలాంబరి ప్రాజెక్టులో భాగమైన 11 రెసిడెన్షియల్​ ఫ్లాట్లను అటాచ్​ చేసింది. ఠాక్రే బావమరిది శ్రీధర్​మాధవ్​పటాంకర్​ పేరుతో ఉన్న శ్రీసాయిబాబా గృహనిర్మితి ప్రైవేట్​ లిమిటెడ్‌ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటి విలువ 6.45 కోట్లు.

Read Also: Paddy Procurement: హస్తినలో తెలంగాణ మంత్రుల టీమ్.. కేంద్ర మంత్రులతో భేటీలు..

పుష్పక్ ​గ్రూప్​ మనీలాండరింగ్​ కేసు దర్యాప్తులో భాగంగా… శ్రీసాయిబాబా గృహనిర్మితికి నగదును బదిలీ చేసినట్లు సమాచారం వచ్చిందని ఈడీ వెల్లడించింది. పుష్పక్​గ్రూప్​కేసు నిందితుడు మహేష్‌ పటేల్, మరో నిందితుడు నందకిశోర్​చతుర్వేది సాయంతో శ్రీధర్​మాధవ్​సంస్థలోకి నగదును బదిలీ చేసినట్లు తెలిపింది. దాదాపు 50 కోట్లను శ్రీధర్​ మాధవ్​ సంస్థకు చెందిన రియల్​ ఎస్టేట్​ ప్రాజెక్టుల్లో పెట్టుబడిగా పెట్టినట్లు తెలిపింది. శ్రీధర్‌ మాధవ్‌ ఆస్తులను ఈడీ అటాచ్​చేయడంపై సంజయ్​రౌత్ ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో మాత్రమే ఈడీ చర్యలు చేపడుతోందన్నారు. గుజరాత్‌ లాంటి రాష్ట్రాల్లో ఈడీ కార్యాలయాలను మూసేసినట్టు ఉందని కామెంట్‌ చేశారు.

Exit mobile version