ఇంట్లో నుంచి బయటకు వస్తే తిరిగి ఇంటికి చేరుతామా? లేదా? సందేహాలు చాలా మందికి వస్తాయి.. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉన్నా మృత్యువు ఎప్పుడు ఎలా పలకరిస్తుందో తెలియదు.. ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాలు జనాలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి.. తాజాగా ఘోర ప్రమాదం వెలుగు చూసింది.. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును వేగంగా వచ్చి లారీ ఢీ కొట్టింది.. ఈ ప్రమాదం జరగగానే బస్సు లో మంటలు వ్యాపించింది.. వెంటనే అలెర్ట్ అయిన ప్రయాణికులు స్వల్ప గాయలతో బస్సులోంచి బయట పడ్డారు.. అతి వేగం కారణం అని పోలీసులు గుర్తించారు..
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని తిరువేకాడు సమీపంలో లారీనీ ఢీకొట్టంది కర్ణాటక కు చెందిన బస్సు.. వేగంగా వచ్చిన బస్సు లారీని ఢీ కొట్టింది.. ఇంజన్ భాగంలో వెంటనే మంటలు చెలరేగాయి.. దీంతో ప్రయాణికులు అతి కష్టం మీద బయట పడ్డారు.. 40 మందిలో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు.. ఫైర్ సిబ్బందికి సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్నారు..
అయితే.. ప్రమాదంతో బస్సులో భారీ మంటలు చెలరేగాయి..దీంతో భయంతో బస్సు నుంచి బయటకు దిగి పరుగులు తీశారు నలభై మంది ప్రయాణీకులు. ఇక ఈ సంఘటనలో ఏకంగా 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మదురై నుంచి వస్తున్న లారీ అత్యంత వేగంతో వెనుక నుంచి ఢీ కొట్టింద బస్సు. ఈ తరునంలోనే.. పూర్తిగా కాలిపోయింది బస్సు. ఇక గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు అధికారులు. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు..ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది..