Deepam Row: తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
- తిరుప్పరంకుండ్రం వివాదం సుప్రీంకోర్టుకు..
- దీపం వెళిగించేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతి..
- హైకోర్టు తీర్పును సవాల్ చేసిన విజయ్ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepam Row: తిరుప్పరంకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయ దీపం వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. సంప్రదాయ దీపం వెలిగించేందుకు అనుమతినిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ముందు మతపరమైన వివాదానికి కారణమైన ఈ దీపం సమస్యపై ముఖ్యమంత్రి విజయ్ సర్కార్ జూన్ 11న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మదురై బెంచ్ జనవరి 6న ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. 2025 డిసెంబర్ 1న సింగిల్ జడ్జి కార్తీక దీపోత్సవం రోజున తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ప్రాచీన రాతి స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. దేవాలయం వద్ద ఉన్న స్తంభంపై దీపం వెలిగిస్తే శాంతిభద్రతలకు సమస్య వాటిల్లుతుందని అప్పటి డీఎంకే సర్కార్ చెప్పడాన్ని కోర్టు వ్యతిరేకించింది.
వివాదం ఏమిటి?
సుబ్రమణ్య స్వామి ఆలయం ఉన్న కొండపైనే హజరత్ సుల్తాన్ సికిందన్ బదుషా అవులియా దర్గా ఉంది. దీని వల్ల ఆలయం వద్ద దీపం వెలిగిస్తే మత పరమైన ఇబ్బందులు ఏర్పడి, రెండు వర్గాల మధ్య సామరస్యం దెబ్బతింటుందని అప్పటి డీఎంకే ప్రభుత్వం, ఆలయ యాజమాన్యం సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేశాయి. దీని తర్వాత దీప స్తంభం ఉన్న ప్రాంతం సుబ్రహణ్య స్వామి ఆలయానిదే అని, ఈ విషయంలో వక్ఫ్ బోర్డుకు ఎలాంటి హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇప్పుడు హైకోర్టు తీర్పుపై విజయ్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. నిజానికి కొండపై ఉన్న ఆలయం 6వ శతాబ్ధానికి చెందినది కాగా, దర్గా 14వ శతాబ్ధానికి చెందినది.
Also Read
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!