Tamil Nadu CM vs Governor: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ మధ్య వివాదం కొనసాగుతునే ఉంది. తమిళనాడులోని ఆరు యూనివర్సిటీలకు వైస్-ఛాన్సలర్ల నియామకంపై వివాదం కొనసాగుతుంది. తమిళనాడు ప్రభుత్వం వైస్ ఛాన్సలర్లను నియమించడానికి సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీలో యూజీసీ ఛైర్మన్‌ను చేర్చాలని సర్కార్ ను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆదేశించారు. ఇక, గవర్నర్ ఈ చర్యను తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
Read Also: IPL 2025: ఢిల్లీకి కెప్టెన్‌గా రాహుల్ కాదా? ఆ ఆటగాడికి పట్టం కట్టడానికి సిద్ధమైన టీం మేనేజ్మెంట్!
అయితే, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ ఉత్తర్వులు వారి విధానపరమైన హక్కులను ప్రభావితం చేస్తాయని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో తెలిపింది. గవర్నర్ ఉత్తర్వులు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం.. కాబట్టి తమిళనాడులో గవర్నర్ అధికారం విషయంలో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టును అభ్యర్థించింది.
Read Also: DaakuMaharaaj : డాకు మహారాజ్ 5వ రోజు AP/TG కలెక్షన్స్.. మాస్ పవర్
కాగా, తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ ఆర్ఎన్ రవి జాప్యాన్ని గతంలో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గత ఏడాది విచారణ సందర్భంగా అప్పటి ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘‘గవర్నర్ గత మూడేళ్లుగా ఏం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. 12 బిల్లులపై పెండింగ్ లో పెట్టడం దారుణమైన చర్యగా అభివర్ణించారు. గతంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వ స్పందనను కూడా సుప్రీంకోర్టు కోరింది.