NTV Telugu Site icon

Tamil Nadu: సుప్రీం వ్యాఖ్యల తర్వాత కూడా.. 10 బిల్లులను తిప్పిపంపిన గవర్నర్ ఆర్ఎన్ రవి..

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ సీఎంగా పోరు జరుగుతోంది. ఇటీవల పంజాబ్ గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ వ్యవహార శైలిపై, అక్కడి ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ పురోహిత పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడం లేదని సీఎం భగవంత్ మాన్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు నిప్పుతో చెలగాలమాడుతున్నారని మండిపడింది. ఈ కేసు విచారణ సందర్భంగా తమిళనాడు వ్యవహారం కూడా సుప్రీం ముందుకు వచ్చింది.

అయితే అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసి వారం రోజుల తర్వాత తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి 10 బిల్లులను తిప్పిపంపడం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో గవర్నర్ రవికి, సీఎం స్టాలిన్ అతని పార్టీ డీఎంకేకి పొసగడం లేదు. చాలా సందర్భాల్లో డీఎంకే పార్టీ కార్యకర్తలు గవర్నర్‌కి వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో పోస్టర్లను అంటించారు.

Read Also: World Cup 2023 Final: 40 ఏళ్లలో నాలుగోసారి ఫైనల్.. గత మూడు గొప్ప మ్యాచ్‌ల్లో ఏం జరిగిందంటే?

గవర్నర్ రవి బిల్లులను వాపస్ చేసిన కొన్ని గంటకే తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం. అప్పావు శనివారం ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే ఈ బిల్లులను మరోసారి గవర్నర్‌కి డీఎంకే ప్రభుత్వం తిప్పిపంపాలని భావిస్తున్నట్లు సమచారం. ఇది జరిగితే గవర్నర్ తప్పనిసరిగా సంతకం చేయాల్సి వస్తుంది. బీజేపీ నియమించిన గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లల క్లియరెన్స్ లో జాప్యం చేస్తున్నాడని అధికార డీఎంకే పార్టీ ఆరోపిస్తోంది. ఇది ఎన్నికైన ప్రభుత్వాన్ని అణగదొక్కడం అని చెబుతోంది.

బిల్లులను తిప్పి పంపండం ద్వారా ఉద్దేశపూర్వకంగానే ప్రజల అభిష్టాన్ని గవర్నర్ దెబ్బతీస్తాయని డీఎంకే ఆరోపిస్తోంది. యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించే గవర్నర్ అధికారాన్ని డీఎంకే ప్రశ్నిస్తోంది. గవర్నర్ రవి గతంలో నీట్ పరీక్ష మినహాయింపు బిల్లును వాపస్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించిన తర్వాత మాత్రమే దానిని భారత రాష్ట్రపతికి పంపారు. ఆన్ లైన్ గేమింగ్ నిషేధం కోరుతూ వచ్చిన బిల్లుపై కూడా ఇదే వైఖరి అవలంభించారు.

Show comments