Tamil Nadu: సుప్రీం వ్యాఖ్యల తర్వాత కూడా.. 10 బిల్లులను తిప్పిపంపిన గవర్నర్ ఆర్ఎన్ రవి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ సీఎంగా పోరు జరుగుతోంది. ఇటీవల పంజాబ్ గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ వ్యవహార శైలిపై, అక్కడి ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ పురోహిత పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడం లేదని సీఎం భగవంత్ మాన్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు నిప్పుతో చెలగాలమాడుతున్నారని మండిపడింది. ఈ కేసు విచారణ సందర్భంగా తమిళనాడు వ్యవహారం కూడా సుప్రీం ముందుకు వచ్చింది.
అయితే అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసి వారం రోజుల తర్వాత తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి 10 బిల్లులను తిప్పిపంపడం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో గవర్నర్ రవికి, సీఎం స్టాలిన్ అతని పార్టీ డీఎంకేకి పొసగడం లేదు. చాలా సందర్భాల్లో డీఎంకే పార్టీ కార్యకర్తలు గవర్నర్‌కి వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో పోస్టర్లను అంటించారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Read Also: World Cup 2023 Final: 40 ఏళ్లలో నాలుగోసారి ఫైనల్.. గత మూడు గొప్ప మ్యాచ్‌ల్లో ఏం జరిగిందంటే?
గవర్నర్ రవి బిల్లులను వాపస్ చేసిన కొన్ని గంటకే తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం. అప్పావు శనివారం ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే ఈ బిల్లులను మరోసారి గవర్నర్‌కి డీఎంకే ప్రభుత్వం తిప్పిపంపాలని భావిస్తున్నట్లు సమచారం. ఇది జరిగితే గవర్నర్ తప్పనిసరిగా సంతకం చేయాల్సి వస్తుంది. బీజేపీ నియమించిన గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లల క్లియరెన్స్ లో జాప్యం చేస్తున్నాడని అధికార డీఎంకే పార్టీ ఆరోపిస్తోంది. ఇది ఎన్నికైన ప్రభుత్వాన్ని అణగదొక్కడం అని చెబుతోంది.
బిల్లులను తిప్పి పంపండం ద్వారా ఉద్దేశపూర్వకంగానే ప్రజల అభిష్టాన్ని గవర్నర్ దెబ్బతీస్తాయని డీఎంకే ఆరోపిస్తోంది. యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించే గవర్నర్ అధికారాన్ని డీఎంకే ప్రశ్నిస్తోంది. గవర్నర్ రవి గతంలో నీట్ పరీక్ష మినహాయింపు బిల్లును వాపస్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించిన తర్వాత మాత్రమే దానిని భారత రాష్ట్రపతికి పంపారు. ఆన్ లైన్ గేమింగ్ నిషేధం కోరుతూ వచ్చిన బిల్లుపై కూడా ఇదే వైఖరి అవలంభించారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!