Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అయితే, అధికార డీఎంకే కూటమిలో సీట్ల పంపిణీపై కొన్ని రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా, కీలక మిత్ర పక్షంగా ఉన్న కాంగ్రెస్ టీవీకే విజయ్ పార్టీలో పొత్తు పెట్టుకుంటుందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే, ఈ రూమర్స్ అన్నింటికి చెక్ పడింది. తమిళనాడులో కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల పంపిణీ ఖరారైంది. పొత్తుకు సంబంధించిన లాంఛనాలు అన్ని బుధవారం పూర్తయ్యాయి.
Read Also: DK.Shivakumar: సీఎం కుర్చీ కోసం విప్లవం అవసరం లేదు
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే బుధవారం సీఎం స్టాలిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల ఒప్పందాన్ని ఖరారు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. తమిళనాడు అసెంబ్లీ పోరులో కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లు కేటాయించారు. కాంగ్రెస్ గతంలో 35 సీట్ల కోసం పట్టుబట్టింది. అదనంగా, కూటమిలో కాంగ్రెస్‌కు ఒక రాజ్యసభ స్థానం ఇస్తామని డీఎంకే హామీ ఇచ్చింది. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సంఖ్యకు సంబంధించి రెండు పార్టీల మధ్య గత కొన్ని రోజులుగా చర్చలు కొనసాగుతున్నాయి. సీట్ల పంపిణీపై రెండు పార్టీలు మీడియా సమావేశంలో అధికారికంగా పొత్తునను వెల్లడించనున్నాయి.
