పోలీసు డిపార్ట్‌మెంట్ అంటే.. ఎప్పుడు డ్యూటీకి వెళ్తారో.. మళ్లీ ఎప్పుడు వస్తారో.. అత్యవసరం అయితే మళ్లీ ఎప్పుడు కబురు వస్తుందో తెలియని పరిస్థితి.. ఏ కార్యక్రమం అయినా సజావుగా సాగాలంటే.. అక్కడ పోలీసులు ఉండి పరిస్థితులను చక్కదిద్దాంల్సిందే. అయితే, వారికి వీక్లీ ఆఫ్ ఇవ్వాలని నిర్ణయించారు తమిళనాడు సీఎం స్టాలిన్.. తమిళనాడు పోలీసులకు దీపావళి కానుకగా వీక్లీ ఆఫ్‌ను తప్పనిసరి చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి స్టాలిన్.. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన కూడా విడుదల చేసింది. కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ వరకు వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక, గార్డు నుంచి ఇన్‌స్పెక్టర్ వరకు తమ గుర్తింపుకార్డును చూపించి, తాము పనిచేసే జిల్లా పరిధిలోని బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించనున్నారు. దీనికోసం ఆధునిక గుర్తింపుకార్డును అందజేయనున్నారు.. సెకండ్ క్లాస్ నుంచి హెడ్ కానిస్టేబుల్ వరకు గార్డులకు వారానికి ఒకరోజు సెలవు ఇవ్వనున్నారు. 2021 సెప్టెంబర్ 13న తమిళనాడు శాసనసభలో పోలీస్ గ్రాంట్‌పై జరిగిన చర్చ సందర్భంగా.. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. హెడ్ కానిస్టేబుల్ వరకు గార్డులందరికీ వారానికి ఒక రోజు సెలవు ఇవ్వబడుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే, దీనిపై ఇవాళ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు వారి కుటుంబ సభ్యులతో గడపడానికి, వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది పేర్కొంది సర్కార్.. ఇవాళ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సెకండ్ క్లాస్ నుండి హెడ్ కానిస్టేబుల్ వరకు వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.