CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay Anti Corruption Drive: తమిళనాడులో తనదైన మార్క్ పాలన అందించే దిశగా ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి విజయ్.. అవినీతిని పూర్తిగా అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న మొత్తంలో అయినా లంచం డిమాండ్ చేసిన అధికారులపై ప్రజలు ఫిర్యాదు చేస్తే వారికి రూ.1 లక్ష వరకు బహుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతి అధికారులపై నేరుగా ప్రజల నుంచే సమాచారం సేకరించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్, ఆన్లైన్ పోర్టల్, ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక, ఫిర్యాదు చేసే వ్యక్తుల వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ప్రభుత్వం హామీ ఇస్తోంది.
అవినీతి నిరోధక శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని సీఎం విజయ్ స్పష్టం చేసినట్లు సమాచారం. శాఖలో రాజకీయ జోక్యం, అంతర్గత అవినీతి వ్యవహారాలపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు మూడు నెలల గడువు విధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్, మున్సిపల్, ట్రాన్స్పోర్ట్ శాఖలపై ప్రత్యేక నిఘా పెట్టే అవకాశం ఉందని సమాచారం. టెండర్లు, కాంట్రాక్టులు, ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం విజయ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. “ప్రజల డబ్బు పవిత్రమైనది.. అవినీతి చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం” అంటూ అధికారులకు ఆయన గట్టి హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం.
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్‌కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్‌మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
‘క్లీన్ గవర్నెన్స్’నే తన ప్రభుత్వ ప్రధాన అజెండాగా ముందుకు తీసుకెళ్తున్న సీఎం విజయ్ తాజా నిర్ణయాలు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. అవినీతి నిర్మూలనపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఇక, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్.. అన్ని వర్గాలను కలుస్తున్నారు.. రాజకీయ నేతలు, ప్రజాసంఘాలు, సామాన్య ప్రజలు ఇలా అందరినీ కలుస్తూ.. వారి సలహాలు తీసుకుంటున్నారు.. తాజాగా, ప్రభుత్వ అంబులెన్స్‌ను ప్రారంభించే ముందు.. ఆయనే ప్రత్యేకంగా దానిని పరిశీలించారు..
తాజావార్తలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?