NTV Telugu Site icon

Delhi: అక్రమ బంగ్లాదేశీ వలసదారులపై ఢిల్లీ ఎల్జీ ఉక్కుపాదం..

Saksena

Saksena

ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులపై కఠిన చర్యలు మొదలయ్యాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా దేశ రాజధానిలో అక్రమంగా చొరబడి బంగ్లాదేశీయులపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఎల్జీ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నగర పోలీస్ చీఫ్‌కి లేఖ రాశారు. రాబోయే 60 రోజుల్లో అక్రమ వలసదారుల్ని గుర్తించి నిర్ణీత కాల వ్యవధిలో వారిని బహిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై అణిచివేత వేళ ఈ ఆదేశాలు వచ్చాయి. ఇటీవల దర్గా హజ్రల్ నిజాముద్దీన్, బస్తీ హజ్రల్ నిజాముద్దీన్‌కి చెందిన ముస్లిం కమ్యూనిటీల నాయకుల బృందం ఎల్జీ వీకే సక్సేనాని కలిశారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా, ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ జాతీయులపై చర్యలు తీసుకోవాలని వారంతా ఎల్జీని కోరారు. ఈ కోరిక మేరకు దేశరాజధానిలో బంగ్లాదేశీయులపై ఉక్కుపాదం మోపుతున్నారు.

Read Also: AI Caught Thiefs: దొంగలను పట్టించిన ఏఐ.. 1.5 కిలోల బంగారం, 2 కిలోల వెండి, రూ. 17 లక్షల నగదు స్వాధీనం

అంతేకాకుండా..‘‘ అక్రమ బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఇళ్లు అద్దుకు ఇవ్వొద్దని, ఏ సంస్థలో ఉపాధి ఇవ్వకూడదని వారు డిమాండ్ చేశారు. వారి పిల్లలకు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ ఇవ్వకూడదని వారు డిమాండ్ చేశారు. అక్రమంగా సంపాదించిన ఆధార్, ఓటర్ ఐడీలను రద్దు చేయాలని కోరారు’’. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ఎల్జీ కఠినమైన చర్యలు తీసుకోవడానికి రెండు రోజుల పాటు ప్రత్యేకమైన డ్రైవ్ ప్రారంభించాలని కోరుకుంటున్నారు.

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ప్రభుత్వంలో హిందువులపై దాడులు తీవ్రమయ్యాయి. హిందువులు ఆస్తులు, వ్యాపారాలు, గుడులు, ఇళ్లు ఇలా అన్నింటిపై మతోన్మాద మూకలు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా హక్కుల కోసం నినదించిన హిందూ నాయకులపై దేశద్రోహం కేసులు పెడుతోంది అక్కడి ప్రభుత్వం. హిందువులకు పెద్ద దిక్కుగా ఉన్న చిన్మోయ్ కృష్ణదాస్‌ని అరెస్ట్ చేసింది. ఇతడి అరెస్టుపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. మరోవైపు అక్కడి రాడికల్ ముస్లిం నేతలు ఇండియాని రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారు.

Show comments