Site icon NTV Telugu

Suvendu Adhikari: “మమతా బెనర్జీ ప్రధాని కాగలదు”.. అమర్త్యసేన్ వ్యాఖ్యలపై సువేందు అధికారి ఆగ్రహం

Suvendu Adhikari

Suvendu Adhikari

Suvendu Adhikari slams Nobel laureate Amartya Sen: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ పై మండిపడ్డారు బీజేపీ నాయకుడు, పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి. ఇటీవల అమర్త్యసేన్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రధాని కాగలిగే సత్తా ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు బెంగాల్ బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. సువేందు అధికారి ఆయనపై బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 మహమ్మారి దేశాన్ని తాకినప్పుడు అమర్త్యసేన్ ఎక్కడు ఉన్నారని.. 2021 ఎన్నికల తరువాత బెంగాల్లో జరిగిన హింసలో హిందువులు మరణించినప్పుడు అమర్త్య సేన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

Read Also: CM KCR: బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. దేశమంతా రైతు బంధు, ఉచిత కరెంటు

ఇంతకుముందు శారదా చిట్‌ఫండ్ నిందితుడు సుదీప్తో సేన్ మమతా బెనర్జీ ప్రధానమంత్రి అవుతారని అన్నారు, ఇప్పుడు అమర్త్యసేన్ అలాంటి ప్రకటనలు చేస్తున్నారు అని సువేందు అధికారి ఎద్దేవా చేశారు. 2019లో కూడా అమర్త్యసేన్ ఇలాగే మాటలు చెప్పారని.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా సీట్లను గెలుచుకుందని.. 2019కి ముందు నరేంద్రమోదీ ప్రధాని కాలేరని అమర్త్యసేన్ అన్నారని.. అయితే బీజేపీకి రెట్టింపు సీట్లు వచ్చాయని ఆయన అన్నారు.

2014 లోక్ సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ అధికారంలోకి రాకముందు, ఆయన ప్రధాని కావడం ఇష్టం లేదని అమర్త్యసేన్ చెప్పారని, మోడీ పాలన విధానాన్ని విమర్శిస్తూ ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో.. గుజరాత్ మోడల్ బాగానే ఉండవచ్చు కానీ మోదీ మైనారిటీలకు, మెజారిటీలకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదని అన్నారని సువేందు అధికారి గుర్తుచేశారు. 2024 ఎన్నికల్లో మోదీకి ఎక్కువ సీట్లలో గెలుస్తారు.. అమర్త్యసేన్ పక్షపాతంతో ఇలా మాట్లాడకూదని అన్నారు. ఆయన విదేశాల్లోనే ఉండనివ్వండి.. ఆయన సలహాలు భారత్ కు అవసరం లేదు, సలహాలు ఇవ్వాల్సి వస్తే ఆయన ఆలోచనల్ని తాలిబాన్ వంటి ఇతర దేశాలలకు అందించండి అంటూ సువేందు ఘాటు విమర్శలు చేశారు.

Exit mobile version