West Bengal Elections: మమతా బెనర్జీ ఇలాఖాలో బీజేపీ ‘‘శ్రీరామ నవమి’’ ర్యాలీ..

  • మమతా బెనర్జీకి సువేందు అధికారి ఛాలెంజ్..
  • దీదీ నియోజకవర్గంలో బీజేపీ శ్రీరామ నవమి ర్యాలీ..
  • ర్యాలీలో పాల్గొన్న సువేందు, టీఎంసీపై విమర్శలు..
Bjp

Bjp

West Bengal Elections: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీల్లో ప్రచారహోరు ముమ్మరమైంది. ముఖ్యంగా టీఎంసీ, బీజేపీలు నువ్వా నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందుకు అధికారి సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేశారు. ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్ నుంచి సువేందు కూడా పోటీలో నిలబడ్డారు. గత ఎన్నికల్లో మమతా బెనర్జీని నందిగ్రామ్ నుంచి సువేందు ఓడించి సంచలనం సృష్టించారు.

Read Also: Vanitha TV : శ్రీరామనవమి వేడుకల్లో.. కొండల స్వామి ‘రఘుకుల తిలక రారా’ సాంగ్ అదుర్స్..!

ఇదిలా ఉంటే, గురువారం దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గంలో జరిగిన శ్రీరామ నవమి ఊరేగింపులో సువేందుకు పాల్గొన్నారు. గతేడాది రామ నవమి వేడుకల్లో అశాంతి చెలరేగింది. ఈ నేపథ్యంలో హౌరా, హుగ్లీ జిల్లాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు, రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సీఎం మమతా నివాసానికి కిలోమీటర్ దూరంలో ఉన్న హజ్రా క్రాసింగ్ వద్ద ఊరేగింపు ముగిసింది. ఊరేగింపులో మాట్లాడిన సువేందు అధికారి.. బెంగాల్ మొత్తం రామరాజ్యం కోరుకుంటోందని, సుపరిపాలన అందిస్తామని, మహిళల భద్రత, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, చొరబాట్లకు అడ్డుకట్ట వేస్తామని హామీ ఇచ్చారు.