Site icon NTV Telugu

Congress: పుతిన్‌కు రాష్ట్రపతి విందు.. శశి థరూర్‌‌కు ఆహ్వానంపై కాంగ్రెస్ గరం గరం..

Congress

Congress

Congress: కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గత కొంత కాలంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు గుప్పించడం, బీజేపీ ప్రభుత్వ చర్యల్ని కొనియాడుతుండటంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంగా ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన స్టేట్ డిన్నర్ కార్యక్రమానికి శశి థరూర్‌కు ఆహ్వానం అందింది. అదే సమయంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేలను కేంద్రం పట్టించుకోలేదు. విందు ఆహ్వానాన్ని శశి థరూర్ అంగీకరించారు. తాను పుతిన్ డిన్నర్‌కు హాజరవుతానని చెప్పారు.

Read Also: Off The Record: అంబటి రాంబాబు మీద డస్ట్ బిన్ బాంబ్ పడబోతుందా? జైలుకు పంపబోతున్నారా?

ఇదిలా ఉంటే, ఇప్పుడు థరూర్ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ గరం గరం అవుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ.. జరుగుతున్న ‘‘ఆట’’ గురించి థరూర్‌కు తెలియదా.? అని ప్రశ్నించారు. ‘‘ కాంగ్రెస్ నాయకుల్ని ఆహ్వానించకుండా, తనను ఆహ్వానిస్తున్నారంటే ఆట ఎందుకు ఆడుతున్నారో, ఎవరు ఆడుతున్నారో, మనం దాంట్లో భాగం కాకూడదో అర్థం చేసుకోవాలి’’ అని అన్నారు.

గురువారం పుతిన్ రాకకు ముందు, రాహుల్ గాంధీ మాట్లాడుతూ, విదేశీ అతిథులు ప్రతిపక్షాల నేతల్ని కలవనీయకుండా మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. గతంలో ఈ సంప్రదాయం ఉండేది కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు వచ్చిన ఒక రోజు తర్వాత, కాంగ్రెస్ ఎంపీ థరూర్‌ని ఆహ్వానించి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని, ఖర్గేని ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version