Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్‌ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
- విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్‌ఫోర్స్ కీలక నివేదిక
- నీట్, కోచింగ్ సంస్కృతిపై సంచలన సిఫార్సులు వచ్చే అవకాశం
- అక్టోబర్‌లో నివేదిక సమర్పించే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్‌ఫోర్స్ కీలక నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నీట్, కోచింగ్ సంస్కృతిపై సంచలన సిఫార్సులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశంలో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్ (NTF) అక్టోబర్ 2026లో తన తుది నివేదికను సమర్పించనుంది. ఈ నివేదికలో నీట్ (NEET) వంటి పోటీ ప్రవేశ పరీక్షల ఒత్తిడి, కోచింగ్ సెంటర్ల సంస్కృతి, తరచూ మారుతున్న పాఠ్యాంశాలు, విద్యా వ్యవస్థలోని అసమానతలు విద్యార్థుల్లో తీవ్ర మానసిక ఒత్తిడికి ప్రధాన కారణాలుగా పేర్కొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
విరమణ పొందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ నేతృత్వంలోని ఈ టాస్క్‌ఫోర్స్‌ను 2025 మార్చిలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల కారణాలను అధ్యయనం చేసి, వాటిని నివారించేందుకు సమగ్ర సిఫార్సులు చేయాలని ఈ కమిటీకి బాధ్యతలు అప్పగించింది. టాస్క్‌ఫోర్స్ అభిప్రాయం ప్రకారం.. విద్యార్థుల ఆత్మహత్యలను కేవలం మానసిక ఆరోగ్య సమస్యగా మాత్రమే చూడలేమని.. అనేక సామాజిక, ఆర్థిక, విద్యా, కుటుంబ సంబంధిత ఒత్తిళ్లు కలిసి ఈ పరిస్థితికి దారితీస్తున్నాయని పేర్కొననుంది.
Also Read
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
ఒత్తిడికి ప్రధాన కారణాలు
నివేదికలో విద్యార్థులపై ప్రభావం చూపుతున్న పలు అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. వాటిలో పోటీ పరీక్షల ఒత్తిడి, కోచింగ్ సెంటర్ల సంస్కృతి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యుల అంచనాలు, వివక్ష, భాషా సమస్యలు, సామాజిక ఒంటరితనం, విద్యాసంస్థల్లోని పరిపాలనా సమస్యలు వంటి అంశాలు ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
పాఠశాల స్థాయి నుంచే ఒత్తిడి
విద్యార్థులపై ఒత్తిడి ఉన్నత విద్యలో కాకుండా పాఠశాల దశ నుంచే ప్రారంభమవుతోందని.. ముఖ్యంగా పోటీ ప్రవేశ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే సమయంలో అది మరింత పెరుగుతోందని కమిటీ అభిప్రాయపడే అవకాశం ఉంది. అలాగే ఇంగ్లిష్ కాని భాషా నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు సాంకేతిక విద్యాసంస్థల్లో అదనపు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నివేదికలో ప్రస్తావించనున్నారు. విద్యాసంస్థల్లో అధిక విద్యార్థుల సంఖ్య, అధ్యాపకుల కొరత, హాస్టల్ సౌకర్యాల లోపం, స్కాలర్‌షిప్‌ల ఆలస్యం, అధ్యాపకులు-విద్యార్థుల మధ్య పరిమిత పరస్పర సంబంధాలు వంటి సమస్యలను కూడా టాస్క్‌ఫోర్స్ ప్రస్తావించనుంది.
అదేవిధంగా పాఠ్యభారాన్ని తగ్గించడం, బట్టీ పద్ధతికి బదులుగా విమర్శనాత్మక ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వడం, విద్యార్థులకు తమకు నచ్చిన విద్యా విభాగాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కల్పించడం, కేవలం మార్కులపై కాకుండా విద్యార్థుల సమగ్ర మానసిక, శారీరక సంక్షేమంపై దృష్టి పెట్టడం వంటి కీలక సిఫార్సులు చేసే అవకాశం ఉంది.
లక్షలాది మందితో సంప్రదింపులు
ఈ నివేదిక తయారీలో భాగంగా టాస్క్‌ఫోర్స్ సుమారు 60 వేల మంది ఉపాధ్యాయులు, దాదాపు 16 వేల కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, 2.5 నుంచి 3 లక్షల మంది తల్లిదండ్రులు, ప్రజల అభిప్రాయాలు సేకరించింది. అలాగే దేశవ్యాప్తంగా సుమారు 40 విద్యాసంస్థలను ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితులను అధ్యయనం చేసింది.
సుప్రీంకోర్టు ఆందోళన
అమిత్ కుమార్ తదితరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2026) కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత పదేళ్లలో విద్యార్థుల ఆత్మహత్యలు రెట్టింపు అయ్యాయని, 2022లో దేశంలో 13 వేల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, అదే ఏడాది రైతుల ఆత్మహత్యల కంటే ఈ సంఖ్య ఎక్కువగా ఉందని కోర్టు పేర్కొంది. మొత్తం ఆత్మహత్యల్లో 7.6 శాతం విద్యార్థులవేనని గుర్తించిన సుప్రీంకోర్టు, సమస్యకు మూల కారణాలను గుర్తించి నివారణ చర్యలు సూచించేందుకు ఈ జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!