Realme 15 Pro 5G: రియల్‌మీ ఇండియా స్మార్ట్‌ఫోన్ సిరీస్ అయిన Realme 15 ప్రో 5G ను జూలై 24న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ ఫోన్‌తో పాటు Realme 15 5G కూడా లాంచ్ కానుంది. రియల్‌మీ ఇప్పటికే ఈ సిరీస్‌లో AI ఆధారిత ఫోటో ఎడిటింగ్ టూల్స్ అయిన AI ఎడిట్ జిని, AI పార్టీ ఫీచర్లను అందించనున్నట్లు ధృవీకరించింది. మరీ త్వరలో విడుదల కాబోతున్న ఈ మొబైల్ విశేషాలను చూద్దామా..
భారీ బ్యాటరీ:
ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అయిన వివరాల ప్రకారం, రియల్‌మీ 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇది 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మందం కేవలం 7.69mm మాత్రమే ఉండనుంది. అంటే భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ స్లిమ్‌గా ఉంటుంది.

Read Also:Ravindra Jadeja: ఎంతకు తెగించార్రా.. గెలుపు కోసం మరీ ఇంతకు దిగజారాలా..? వీడియో వైరల్
ఆకర్షణీయమైన డిస్ప్లే:
ఈ ఫోన్‌లో 4D కర్వ్+ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 94% స్క్రీన్ టూ బాడీ రేషియో, ఇంకా 2,500Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. స్క్రీన్‌కి Corning Gorilla Glass ప్రొటెక్షన్ కూడా ఇవ్వబడుతుంది. సెంటర్డ్ హోల్ పంచ్ డిజైన్ లో కెమెరా ఉండనుంది. పైగా ఈ ఫోన్ IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ బిల్డ్‌తో వస్తోంది. ఇది అత్యంత ప్రీమియం ఫీచర్‌గా చెప్పవచ్చు.

గేమింగ్, ప్రాసెసర్:
రియల్‌మీ 15 ప్రో 5Gలో Snapdragon 7 Gen 4 చిప్‌సెట్ ఉంటుంది. ఇది 120fps స్టేబుల్ గేమ్‌ప్లే అందించగలదు. అలాగే GT Boost 3.0, Gaming Coach 2.0 లాంటి అధునాతన గేమింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గేమింగ్ ప్రియులకు మంచి ఎంపిక అవుతుంది.
Read Also:Shocking Incident : నాంపల్లిలో కలకలం.. పాడుబడ్డ ఇంట్లో వెలుగు చూసిన అస్థిపంజరం

ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లోఇంగ్ సిల్వర్, సిల్క్ పింక్, సిల్క్ పర్పుల్, వెల్వెట్ గ్రీన్ రంగుల్లో లభించనుంది. రియల్‌మీ ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్‌లను విక్రయించనుంది. కెమెరా ఫీచర్లు లాంచ్‌కు ముందు అధికారికంగా తెలిపింది. మొత్తంగా Realme 15 Pro 5G శక్తివంతమైన బ్యాటరీ, స్టన్నింగ్ డిస్‌ప్లే, గేమింగ్ ఫీచర్లతో మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ప్రత్యేకంగా నిలవడానికి సిద్ధమవుతోంది. జూలై 24న లాంచ్ తరువాత ధర, స్టోరేజ్ వేరియంట్లపై మరింత సమాచారం వెలువడనుంది.