NTV Telugu Site icon

The Kerala Story: “ది కేరళ స్టోరీ” సినిమా ఆపడానికి సుప్రీం నిరాకరణ..

Thw Kerala Story

Thw Kerala Story

The Kerala Story: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘ది కేరళ స్టోరీ’ సినిమా సంచలనంగా మారుతోంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంకా చేస్తున్నారు. శుక్రవారం రోజున హిందీ, తెలుగు, తమిళ్, మళయాళం భాషల్లో సినిమా విడుదల కాబోతోంది. కేరళలో హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన 32 వేల మంది అమ్మాయిలు ఇస్లాంలోకి పథకం ప్రకారం మార్చబడ్డారని, ఇందులో కొందరు ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో పనిచేయడానికి వెళ్లారనే ఇతివృత్తం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమాను కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు అక్కడి కాంగ్రెస్ పార్టీ కూడా ఆక్షేపిస్తోంది. సినిమా విడుదల నిలిపివేయాలని, సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: Dog Attack: వీధి కుక్కల దాడిలో 12 ఏళ్ల బాలుడు మృతి

అయితే ఈ సినిమాపై స్టే విధించాలని కోరతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ను 1.60 కోట్ల మంది వీక్షించినట్లు కపిల్ సిబల్, మరో న్యాయవాది నిజాం పాషా మంగళవారం జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సినిమా హిందూ, ముస్లింల మధ్య విభజన తెచ్చే విధంగా ఉందని, విద్వేషాలను వ్యాపిస్తుందని ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు. ఈ సినిమా ఘోరమైన ద్వేషపూరిత ప్రసంగాల ప్రచారమని న్యాయవాది నిజాం పాషా పేర్కొన్నారు. అయితే ద్వేషపూరిత ప్రసంగాల్లో పలు రకాలు ఉంటాయి, ఈ సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిందని, కాబట్టి దీన్ని వ్యతిగత ప్రసంగం కింద పరిగణించలేని, ఒక వేళ మీరు సినిమా విడుదలను సవాల్ చేయాలనుకుంటే తగిని వేదికి మీద సెన్సార్ సర్టిఫికేట్ ను సవాల్ చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాదులకు సూచించింది.

పిటిషన్లు ముందుగా హైకోర్టున ఆశ్రయించాలని జస్టిస్ నాగరత్న అన్నారు. శుక్రవారం సినిమా విడుదల కానుండటంతో సమయం లేదని నిజాంపాషా ధర్మాసనం ముందు పేర్కొన్నారు. ఇది మైదానం కాదని, లేకపోతే అందరూ సుప్రీంకోర్టుకు రావడం ప్రారంభిస్తారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మత మార్పుడి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. దీనిపై కేరళ సీఎం విజయన్ దీన్ని బీజేపీ ప్రాపగండా ఎజెండాగా పేర్కొన్నారు.

Show comments