Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- న్యాయవ్యవస్థలో అవినీతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్
- విద్యావేత్తలపై విధించిన నిషేధం ఎత్తివేత
- ధర్మాసనం నిర్ణయంపై విస్మయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మధ్య కాలంలో ఎన్సీఈఆర్టీ (NCERT) 8వ తరగతి పాఠ్యపుస్తకంగా ‘‘న్యాయవ్యవస్థలో అవినీతి’’ అనే పాఠంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం చాలా సీరియస్ అయింది. గత ఫిబ్రవరిలో చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే న్యాయవ్యవస్థను గురించి విద్యార్థులకు తప్పుడు సందేశాన్ని పంపిస్తున్నారని ఫైర్ అయింది. దీంతో ఎన్సీఈఆర్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పింది. అభ్యంతరకర పాఠ్యాంశాలను వెబ్సైట్ నుంచి తొలగించి.. పుస్తకాల పంపిణీని నిలిపివేసింది.
తాజాగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ముగ్గురు విద్యావేత్తలపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుంది. అలాగే వారు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను వక్రీకరించారన్న వ్యాఖ్యలను కూడా న్యాయస్థానం వెనక్కి తీసుకుంది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రొఫెసర్ మైఖేల్ డానినో, సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్లపై మార్చి 11న జారీ చేసిన ఆదేశాలను సవరించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు ఈ ముగ్గురు విద్యావేత్తలను అకడమిక్ కార్యకలాపాల నుంచి దూరంగా ఉంచాలని ఇచ్చిన ఆదేశాన్ని తాజాగా రద్దు చేసింది.
Also Read
- Supreme Court: "ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
- Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
“దరఖాస్తుదారులు ఇచ్చిన వివరణను పరిశీలించిన తర్వాత.. గత ఆదేశంలోని 8వ పేరాలో ఉన్న సూచనలను సవరించడం సముచితమని భావిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఇతర సంస్థలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు” అని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. అలాగే ఈ ముగ్గురు విద్యావేత్తలు కావాలనే వాస్తవాలను తప్పుగా చూపించారన్న వ్యాఖ్యలను కూడా ధర్మాసనం వెనక్కి తీసుకుంది. వారు ఇచ్చిన వివరణల నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 2026లో “మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర” అనే అధ్యాయంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఉన్న కొన్ని అంశాలు వివాదానికి దారితీశాయి. మీడియా కథనాల నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. అనంతరం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) ఆ భాగాన్ని “అనుకోకుండా జరిగిన పొరపాటు”గా పేర్కొంటూ పుస్తకం నుంచి తొలగించింది. ఈ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఆ పుస్తకం ముద్రణ, పంపిణీపై తాత్కాలిక నిషేధం విధించింది. అలాగే పాఠ్యపుస్తకాల తయారీ, సిలబస్ రూపకల్పనలో ఈ ముగ్గురు నిపుణులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామ్యం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆ ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోసారి న్యాయస్థానం నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!