Deepam Row: దీపం ఎందుకు వెలిగించలేదు? మధురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఫైర్!
- దీపం వివాదంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- ఎందుకు దీపం వెలిగించలేదని కలెక్టర్‌ను ప్రశ్నించిన కోర్టు..
- ఇది కోర్టు ధిక్కారమే అని, ఉక్కుపాదంతో అణచివేస్తామని వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepam Row: తమిళనాడు తిరుప్పరంకుండ్రంలోని కొండపై దీపతూన్(దీప స్తంభం) వద్ద కార్తీక దీపాన్ని వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ విజయ్ సర్కార్ దీపాన్ని అక్కడ వెలిగించలేదు. తమ ఆదేశాలు అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మధురై జిల్లా కలెక్టర్‌ను సుప్రీంకోర్టు నిలదీసింది. కోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిన బాధ్యత ఆయనదే అని స్పష్టం చేసింది. ఆలయ ట్రస్టీలపై కూడా ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ నిర్వహకులకు వ్యతిరేకంగా దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేసింది. కోర్టు ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితులను కఠినంగా ఎదుర్కోవాల్సిన సమయం వచ్చిందని, లేకపోతే రాజ్యాంగపరమైన గందరగోళం ఏర్పడుతుందని హెచ్చరించింది.
“కోర్టు ఆదేశాలను ఎవరూ నీరుగార్చలేరు. ఎవరైనా రాజ్యాంగపరమైన గందరగోళాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తే, దాన్ని మేం సరిచేస్తాం” అని జస్టిస్ అరవింద్ కుమార్ వ్యాఖ్యానించారు. మధురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. మీరు జిల్లా కలెక్టర్, మీరు ఆ పనిచేయాల్సింది అంటూ కలెక్టర్ తరుఫున న్యాయవాదిని ప్రశ్నించింది. ఇదే సమయంలో ఆలయ ట్రస్టీ వ్యవహారశైలిపై కూడా సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యల్ని ఉక్కుపాదంతో అణచివేయాల్సి ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నలుగురు ఆలయ ట్రస్టీలకు కోర్టు ధిక్కరణ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే మేము మౌనంగా ఉండలేమని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 129 ప్రకారం సుప్రీంకోర్టుకు కోర్టు ధిక్కరణపై చర్యలు తీసుకునే అధికారం ఉందని చెప్పింది. చట్టం యెక్క ఔచిత్యానికి భంగం కలిగితే బాధ్యులను న్యాయస్థానం ముందు నిలబట్టే అధికారం తమకు ఉందని చెప్పింది.
Also Read
- MK Stalin: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన స్టాలిన్..
- Delimitation 2026: లోక్‌సభ సీట్లు 50 శాతం పెంపు? డీలిమిటేషన్‌పై కేంద్రం కీలక ప్రతిపాదన!
- DMK MLA: తమిళనాడులో మరో ఎమ్మెల్యేపై మహిళా అధికారిణి వేధింపుల ఆరోపణలు.. ఎఫ్ఐఆర్ నమోదు!
- Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
తిరుప్పరంకుండ్రం దీపం కేసులో ఆలయ ట్రస్టీలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయబోమని ఆలయ ట్రస్టీలు స్పష్టంగా వైఖరి తీసుకున్నట్లుందని వ్యాఖ్యానించింది. ట్రస్టీల వైఖరి తీవ్రమైన ఉల్లంఘనగా అభివర్ణించింది. ఇతర అధికారులు కూడా ట్రస్టీల చర్చలకు సహకరించారని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు అధికారాన్ని బలహీనపరిచే ఉద్దేశమే అని వ్యాఖ్యలు చేసింది. నవంబర్ 24న సాయంత్రం 6 గంటలకు కొండపై ఉన్న దీపతూన్ వద్ద దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ దీపం వెలిగించలేదు. దీపత్తూన్ వద్ద దీపం వెలిగించకపోవడంపై తమిళనాడు ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది. ఈ వైఫల్యానికి అరుల్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయ అధికారులే కారణమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
తాజావార్తలు
-
Deepam Row: దీపం ఎందుకు వెలిగించలేదు? మధురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఫైర్!
-
Mythri Movie Makers: సౌత్ హిట్ డైరెక్టర్లందరూ మైత్రి చేతిలోనే.. ఏ ఒక్కరినీ వదలట్లేదుగా!
-
Alias Rukmini : ‘అలియాస్ రుక్మిణి’లో శృంగార సన్నివేశాలున్నాయా?.. నిర్మాత దీప్తి షాకింగ్ క్లారిటీ!
-
Indian 3 : ‘ఇండియన్ 3’పై క్రేజీ అప్డేట్.. అప్పుడే మొదలెట్టేశారుగా..!
-
Ramayana : ‘రామాయణ’కు సుప్రీంకోర్టులో భారీ ఊరట..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!