Supreme Court: చిన్నారుల మిస్సింగ్‌లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- చిన్నారుల మిస్సింగ్‌లపై సుప్రీంకోర్టు సీరియస్
- ఇక కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే
- అన్ని పోలీస్ స్టేషన్లకు సుప్రీంకోర్టు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పిల్లల మిస్సింగ్ కేసులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ఇకపై పిల్లల మిస్సింగ్‌పై కిడ్నాప్ ఎఫ్ఐఆర్ తప్పనిసరిగా నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులో 2011 నుంచి కనిపించకుండా పోయిన ఒక చిన్నారి కేసును విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా ఎవరైనా వ్యక్తి లేదా చిన్నారి కనిపించకుండా పోయిన ప్రతి కేసులో కిడ్నాప్ కేసు నమోదు చేయడం అన్ని పోలీస్ స్టేషన్లకు తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. చిన్నారుల అక్రమ రవాణా, ఏళ్ల తరబడి ఆచూకీ లభించని పిల్లల సమస్యను అత్యంత గంభీరంగా పరిగణిస్తూ పోలీస్ వ్యవస్థను అప్రమత్తం చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని న్యాయస్థానం పేర్కొంది.
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
దేశంలో సుమారు 47 వేల మంది పిల్లలు ఇప్పటికీ ఆచూకీ లేకుండా ఉన్నారనే అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ‘‘ఏ వ్యక్తి లేదా చిన్నారి కనిపించకుండా పోయిన సమాచారం అందిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ప్రాథమిక విచారణ పేరుతో ఆలస్యం చేయకూడదు. బాధిత కుటుంబ సభ్యులపై వెతికే బాధ్యతను మోపకూడదు.’’ అని స్పష్టం చేసింది.
అంతేకాకుండా నమోదయ్యే ఎఫ్ఐఆర్లో భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం కిడ్నాప్‌కు సంబంధించిన సెక్షన్లు తప్పనిసరిగా చేర్చాలని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు అహ్సానుద్దీన్ అమానుల్లా, ఆర్. మహాదేవన్‌ల ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇది ఎంతో పెద్ద సమస్య. కానీ దీని తీవ్రతను ఎవరూ గుర్తించడం లేదు. ప్రజలు ఈ విషయంలో దిగ్భ్రాంతి చెందాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవాన్ని చూసీ చూడనట్టుగా ఎలా ఉండగలం?.’’ అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!