Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Supreme Court On Pegasus Spyware Case

Pegasus Spyware Case: ఎలాంటి పెగాసస్ స్పైవేర్ గుర్తించలేదు.. విచారణకు కేంద్రం సహకరించలేదు

Published Date :August 25, 2022 , 12:26 pm
By Venu Goapl Reddy
Pegasus Spyware Case: ఎలాంటి పెగాసస్ స్పైవేర్ గుర్తించలేదు.. విచారణకు కేంద్రం సహకరించలేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Supreme Court On Pegasus Spyware Case: దేశ రాజకీయాలకు ఓ కుదుపుకుదిపేసిన పెగాసస్ స్పైవేర్ పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ తన రిపోర్టును ఈ రోజు సుప్రీంకోర్టుకు అందచేసింది. దీనిపై సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారించింది. 29 ఫోన్లను పరిశీలించగా.. 5 ఫోన్లలో మాల్‌వేర్‌లు గుర్తించామని..అయితే పెగాసస్ స్పైవేర్ కు సంబంధించి ఎలాంటి రుజువు లేదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. అయితే ఈ విచారణ సమయంలో భారత ప్రభుత్వం తమకు సహకరించలేదని కమిటీ సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

రాజకీయనాయకులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల ఫోన్లను ట్రాప్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగిస్తోందని విపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో సుప్రీం కోర్టు సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ పర్యవేక్షణలో కమిటీ నివేదిక రూపొందించింది. ఈ నివేదికను మూడు భాగాలుగా సమర్పిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. నివేదికలోని ఒక భాగాన్ని పబ్లిక్ గా ఉంచతామని సీజేఐ తెలిపారు. అయితే పూర్తి నివేదికను పూర్తిగా పబ్లిక్ డొమైన్ లో ప్రచురించవద్దని కమిటీ కోరింది. పూర్తి నివేదిక పరిశీలించకుండా ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసును నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

Read Also: PM Security Breach Case: ప్రధాని భద్రతా వైఫల్యంలో పంజాబ్ ఎస్ఎస్పీదే బాధ్యత: సుప్రీంకోర్టు

ఇజ్రాయిల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ డెవలప్ చేసిన స్పైవేర్ ను ఉపయోగించి ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల ఫోన్లను కేంద్ర ప్రభుత్వం స్నూప్ చేస్తుందని కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరడంతో కమిటీని నియమించింది. ‘‘ది వైర్’’ వార్తా పోర్టల్ భారత్ లోని 142 మంది కన్నా ఎక్కువ మందిని లక్ష్యంగా చేసుకుని పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగించారని పేర్కొంది. ఈ జాబితాలో కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఇద్దరు కేంద్ర మంత్రులు, మాజీ ఎన్నికల కమిషనర్, ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు, మాజీ న్యాయమూర్తి , 40 మంది పాత్రికేయులు ఉన్నారని పేర్కొంది. దీంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో పెగాసస్ రచ్చ మొదలైంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CJI NV Ramana
  • Pegasus political issue
  • Pegasus spyware case
  • Supreme Court
  • Supreme Court On Pegasus Spyware Case

తాజావార్తలు

  • YS Jagan Padayatra: వచ్చే సంవత్సరం నా పాదయాత్ర.. ఇక, చంద్రబాబుకి ప్రతిరోజూ సినిమా చూపిస్తాం..!

  • RaashiKhanna : బ్లాక్ డ్రెస్ లో ముద్దొస్తున్న రాశి ఖన్నా

  • India Advisory Iran: “వెంటనే బయలుదేరండి”.. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులకు కీలక హెచ్చరిక..

  • AC Sales Decline: పడిపోయిన ఏసీల అమ్మకాలు.. కారణం అదేనా..?

  • Flying Flea C6 Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్.. 3.7 సెకన్లలో 60 km/h వేగం.. 154KM రేంజ్

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions