Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
- సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు
- హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ సవాల్
- రేపు విచారించనున్న సుప్రీం ధర్మాసనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు మరోసారి సంచలనంగా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీకి మేఘాలయ హైకోర్టు బెయిల్ మంజూర్ చేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించింది. బెయిల్ మంజూరు చేస్తూ మేఘాలయ హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Maharashtra Politics: కాంగ్రెస్‌లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
ఈ పిటిషన్‌పై గురువారం జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ శీల్ నాగులతో కూడిన ధర్మాసనం ముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తప్పిదమని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. అరెస్టు సమయంలో సోనమ్‌కు అరెస్టుకు సంబంధించిన పూర్తి కారణాలను అందించలేదనే కారణంతోనే బెయిల్ మంజూరైందని తుషార్ మెహతా తెలిపారు. అయితే పత్రాల్లో ఒక నిబంధనను ప్రస్తావించే సమయంలో టైపోగ్రాఫికల్ పొరపాటు మాత్రమే జరిగిందని.. అది చట్టపరంగా పెద్ద లోపం కాదని వాదించారు. అంతేకాకుండా బెయిల్‌పై విడుదలైతే నిందితురాలు పరారయ్యే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం శుక్రవారం విచారణకు కేసును జాబితాలో చేర్చేందుకు అంగీకరించింది.
ఇదిలా ఉండగా జూన్ 29న మేఘాలయ హైకోర్టు… ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సమర్థిస్తూ సోనమ్ రఘువంశీకి బెయిల్ మంజూరు చేసింది. గతేడాది మే 23న హనీమూన్ కోసం మేఘాలయలోని సోహ్రా ప్రాంతానికి వెళ్లిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ అదృశ్యమయ్యారు. అనంతరం 2025 జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం లోతైన లోయలో లభ్యమైంది. ప్రియుడి కోసం హంతకులతో కలిసి భర్త హత్యకు సోనమ్ రఘువంశీ కుట్ర పన్నినట్లు పోలీసులు ఆరోపించారు. మరోవైపు సోనమ్ బెయిల్ మంజూరు చేయడంపై బాధిత కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. భర్తను చంపిన వ్యక్తికి ఎలా మంజూరు చేస్తారని న్యాయస్థానాలను ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
-
Murder Case: ‘నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు’.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?