Supreme Court: విడాకుల భరణం నిర్ణయించడానికి 8 మార్గదర్శకాలను జారీ చేసిన సుప్రీంకోర్టు
- విడాకుల భరణం నిర్ణయించేందుకు మార్గదర్శకాలను వెల్లడించిన సుప్రీంకోర్టు..
- దేశంలోని అన్ని న్యాయస్థానాలు విడాకుల కేసుల్లో వీటిని పాటించాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: తన భార్య పెట్టిన వేధింపులు భరించలేక బెంగళూరులో టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడంతో.. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తాను రాసిన సూసైడ్ నోట్ సుప్రీంకోర్టు వరకు చేరాలని అతడు కోరుకున్నాడు. అయితే, ఈ ఘటన జరిగి 48 గంటలు గడవక ముందే, వైవాహిక చట్టాల దుర్వినియోగంపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే విడాకుల సందర్భంగా తీసుకునే భరణం గురించి న్యాయస్థానం విధివిధానాలు వెల్లడించింది. మొత్తం 8 మార్గదర్శాలను సిద్ధం చేసింది. కేసు విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీవీ వర్లేల ద్విసభ్య ధర్మాసనం.. భరణం కింద ఇచ్చే నగదు గురించి గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ఆధారంగా దేశవ్యాప్తంగా కోర్టులు విడాకుల కేసుల్లో భరణం నిర్ణయించాలని సుప్రీంకోర్టు సూచించింది.
Read Also: Sai Pallavi: ఇకపై ఊరుకునేది లేదు.. లీగల్ యాక్షన్ తీసుకుంటా: సాయిపల్లవి
Also Read
అయితే, సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు సందర్బంగా ఈ 8 అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని వెల్లడించింది. విడాకుల సమయంలో శాశ్వత భరణం నిర్ణయించడానికి ఇవి చాలా కీలకమైనవని తెలిపింది. తన భార్య నిఖిత సింఘానియా విడాకుల సమయంలో 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని.. అలాగే, నెలకు రూ. 2లక్షలు భరణం కావాలని డిమాండ్ చేసినట్లు అతుల్ సుభాష్ తన తన సూసైడ్ నోట్లో రాసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 8 గైడ్ లైన్స్ జారీ చేయడం గమనార్హం.
Read Also: OCTOPUS Mock Drill: శ్రీశైలం డ్యామ్ వద్ద అర్ధరాత్రి ఆక్టోపస్ మాక్ డ్రిల్
సుప్రీంకోర్టు జారీ చేసిన 8 మార్గదర్శకాలు ఇవే..
* భార్యాభర్తల యొక్క సామాజిక ఆర్ధిక స్థితిగతులు తెలుసుకోవడం.
* ఫ్యూచర్లో భార్య, పిల్లల ప్రాథమిక అవసరాలు
* ఇరువురి ఉద్యోగ- విద్యార్హతలు, ఆదాయం-ఆస్తులు తెలుసుకోవాలి.
* ఆదాయం మరియు ఆస్తి సాధనాలు వివరాలు తీసుకోవాలి.
* అత్తింట్లో ఉన్నప్పుడు భార్య జీవన ప్రమాణం ఏంటో తెలుసుకోవాలి.
* కుటుంబం కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా? అనే విషయాన్ని తెలుసుకోవాలి.
* ఉద్యోగం చేయని భార్యకు న్యాయ పోరాటానికి తగిన మొత్తం అందించాలి.
* భర్త ఆర్దిక పరిస్థితి అతడి ఆదాయాలు, భరణం సహా ఇతర బాధ్యతలు తీసుకోవాలి.
తాజావార్తలు
-
Cancer Injection: భారత్‌లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!