Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో కీలక పరిణామం.. విచారణ నుంచి తప్పుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bilkis Bano Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల బిల్కిస్ బానో అత్యాచారం కేసులోొ 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. అయితే ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు బాధితురాలు బిల్కిస్ బానో. ఇదిలా ఉంటే బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది తప్పుకున్నారు.
Read Also: Raja Pateriya: ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్
Also Read
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్‌ను కాల్చి చంపిన దుండగులు
బిల్కిస్ బానో కుటుంబ సభ్యులను హత్య చేయడంతో పాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన నేరం కింది ఈ 11 మందిని దోషులు గుర్తించి వారికి జీవిత ఖైదు విధించింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాల్సిందిగా కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ మార్గదర్శకాల కింది బిల్కిస్ బానో కేసులో శిక్ష పడిన 11 మందిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడుదల రాజకీయ రచ్చకు దారి తీసింది. విపక్షాలు గుజరాత్ ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు గుప్పించాయి. వీరంతా విడుదలైన తర్వాత పలువురు బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు స్వీట్లు పంచుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.
2002 గుజరాత్ అల్లర్లు జరుగుతున్న సమయంలో మార్చి 3,2022న 21 ఏళ్లు ఉన్న 5 నెలల గర్భిణి బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మూడేళ్ల కుమార్తెతో పాటు మరో ఆరుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హత్య చేశారు. గోద్రాలో సబర్మతి రైల్ కోచ్ దహనం తరువాత.. కరసేవకులు చనిపోయిన తర్వాత గుజరాత్ అల్లర్లు చోటు చేసుకున్నాయి. బిల్కిస్ బానోపై అత్యాచారం, హత్యలకు పాల్పడిన 11 మందికి ముంబై స్పెషల్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఆ తరువాత బాంబే హైకోర్టు ఈ శిక్షను సమర్థించింది. కొన్ని రోజుల క్రితం వీరంతా విడుదలయ్యారు. ఈ విడుదలను వ్యతిరేకిస్తూ బిల్కిస్ బానో న్యాయపోరాటం చేస్తోంది.
తాజావార్తలు
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్‌పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!