Supreme Court: ‘‘అమ్మాయిలు మీ లైంగిక కోరికల్ని నియంత్రించుకోండి’’.. హైకోర్టు తీర్పుని కొట్టేసిన సుప్రీంకోర్టు..
- కలకత్తా హైకోర్టు తీర్పుని కొట్టేసిన సుప్రీంకోర్టు..
- గతేడాది వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..
- అమ్మాయిలు సెక్స్ కోరికలు నియంత్రించుకోవాలి..
- అభ్యంతరకర వ్యాఖ్యలుగా పేర్కొన్న సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: లైంగిక వేధింపుల కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టేసింది. గతేడాది ఈ కేసులో యుక్తవయసులోని బాలికను ‘లైంగిక ప్రేరేపణలను నియంత్రించుకోవాలి’’ అని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఈ కేసుని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ(పోక్సో) చట్టం కింద నమోదయ్యే కేసుల నిర్వహణపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసినట్లు న్యాయమూర్తులు తెలిపారు. తీర్పుల ఎలా రాయాలనే దానిపై కూడా ఆదేశాలు జారీ చేశామన్నారు.
గతేడాది డిసెంబర్ 8న అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని విమర్శించింది. ఇవి పూర్తిగా అభ్యంతరకరమైనవి, అసంబద్ధమైనవిగా పేర్కొంది. హైకోర్టు డివిజన్ బెంచ్ చేసిన కొన్ని పరిశీలనలను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. న్యాయమూర్తులు తీర్పులు రాసేటప్పుడు ‘‘బోధించకూడదు’’ అని స్వయంగా సుప్రీంకోర్టు రిట్ పిటిషన్ ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అక్టోబర్ 18, 2023 నాటి ఈ హైకోర్టు తీర్పును సవాల్ చేసింది.
Also Read
- Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
- India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
- E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
Read Also: Janhvi Kapoor: నువ్వేందిరా సామీ.. జాన్వీ కపూర్‌తో రాఖీ కట్టించుకున్నావ్! వీడియో వైరల్
అసలేంటి కేసు..? హైకోర్టు ఏం చెప్పింది..?
గతేడాది పోక్సో కేసుని హైకోర్టు న్యాయమూర్తులు చిత్త రంజన్ దాస్, పార్థసారధి సేన్‌లతో కూడిన డివిజన్ బెంజ్ విచారణ జరిపింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. విచారణలో అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నట్లు తేలింది. ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉందనే కారణంగా బాలికపై అత్యాచారం చేసినప్పటికీ యువకుడిని నిర్దోషిగా విడుదల చేసింది. పరస్పర సమ్మతితో సెక్స్ లో పాల్గొనే కేసుల్లో పోక్సో చట్టంపై ఆందోళన వ్యక్తం చేసింది. అబ్బాయిలు, అమ్మాయిలకు పలు సూచనలు చేసింది.
యుక్త వయసులో బాలికను తమ లైంగిక కోరికను నియంత్రించుకోవాలని సూచించింది. రెండు నిమిషాల ఆనందం కోసం లొంగిపోతే సమాజంలో ఆమె విలువను కోల్పోతోందని, ఆమె శరీరం యొక్క సమగ్రతను ఆమె హక్కును రక్షించాలని, ఆమె గౌరవాన్ని స్వీయ విలువను రక్షించాలని, ఆమె గోప్యతను రక్షించుకోవాలని సూచించింది. అబ్బాయిలు స్త్రీల విధుల్ని గౌరవించాలని, ఇలాంటి విషయాల్లో పిల్లల తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులుగా ఉండాలి, మంచి-చెడుల గురించి చెప్పాలని, సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యతను గురించి నొక్కి చెప్పింది. మగపిల్లలకు తల్లిదండ్రులు మహిళలను ఎలా గౌరవించాలో చెప్పాలని, లైంగిక కోరికతో ప్రేరేపించబడకుండా మహిళలతో ఎలా స్నేహం చేయాలో చెప్పాలని హైకోర్టు సూచించింది.
తాజావార్తలు
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స!
-
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
ట్రెండింగ్
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!