Supreme Court: ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’.. నిందితులు జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
- ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’
- నిందితులపై కనికరం చూపించకూడదు
- జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాయకష్టం చేసి సంపాదించిన డబ్బంతా సైబర్ నేరగాళ్లు చిటికలో మాయం చేసేస్తున్నారు. వృద్ధాప్యంలో బతికేందుకు దాచుకున్న డబ్బంతా కంత్రీగాళ్లు కొట్టేసి ముసలోళ్ల కడుపు కొడుతున్నారు. ఇలాంటి తరుణంలో సైబర్ నేరగాళ్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది.
బుధవారం సైబర్ నేరగాడికి సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవుల వంటివారు.’’ అని వ్యాఖ్యానించారు. సైబర్ మోసం కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరిస్తూ.. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
Also Read
- Nepal Flash Floods: నేపాల్‌లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
సైబర్ నేరగాళ్లు ప్రజల కష్టార్జితాన్ని మోసం చేసి సమాజానికి తీవ్ర నష్టం కలిగించే ‘పరాన్నజీవుల’ వంటి వారని వ్యాఖ్యానించింది. అటువంటి నేరగాళ్ల పట్ల ఉదారంగా వ్యవహరించకూడదని.. వారిని జైలులో ఉంచడమే సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఉత్తమమని సీజేఐ స్పష్టంగా పేర్కొన్నారు. సైబర్ నేరాల నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించిందని వ్యాఖ్యానించారు. నిందితులు ఒక రాష్ట్రంలో మోసాలకు పాల్పడి.. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తారని.. దీనివల్ల ఈ నేరాలను నియంత్రించడం మరింత సవాలుగా మారుతుందని తెలిపారు. ఇటువంటి వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ధర్మాసనం నొక్కి చెప్పింది.
పెరుగుతున్న ‘డిజిటల్ అరెస్టులు’, సైబర్ మోసాల కేసులను సుప్రీం కోర్టు ఇటీవల సుమోటోగా స్వీకరించింది. అంబాలాకు చెందిన ఒక వృద్ధ దంపతులు తమ జీవితకాలపు పొదుపును కోల్పోవడానికి కారణమైన మోసాన్ని వివరిస్తూ ఒక లేఖ రాసిన తర్వాత ఈ చర్య తీసుకోబడింది. గతంలో దేశవ్యాప్తంగా డిజిటల్ మోసాల కేసులలో చర్యలు తీసుకోవడానికి దర్యాప్తు సంస్థ సీబీఐకి సుప్రీంకోర్టు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు అటువంటి కేసులను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కఠినమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
తాజావార్తలు
-
Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
-
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్‌కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
-
Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
-
Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..