Jacqueline Fernandez: అతడు నా కెరీర్‌ని నాశనం చేశాడు.. జాక్వెలిన్ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukesh Chandrashekhar Ruined My Career Says Jacqueline Fernandez: సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసు వెలుగుచూసినప్పటి నుంచి.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు మీడియాలో మార్మోగుతూనే ఉంది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో రహస్యాలు బయటపడ్డాయి. సుకేశ్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలూ బయటకు వచ్చాయి. ఇన్నాళ్లూ ఈ మనీలాండరింగ్ కేసు విషయంలో పెద్దగా నోరు విప్పని జాక్వెలిన్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడించింది. సుకేశ్ తన కెరీర్‌ని నాశనం చేశాడని, తన భావోద్వేగాలతో అతడు ఆడుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. సుకేశ్ ఓ మోసగాడని.. అతని తప్పుల్ని తాను గుర్తించలేకపోయానని వాపోయింది. తనని నయవంచనకు గురి చేసి, తప్పుదారి పట్టించాడని పేర్కొంది. ఈ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది.
Viral Video: పెళ్లి వేడుకల్లో అపశృతి.. డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలిన యువకుడు
Also Read
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
పింకీ ఇరానీ అనే మహిళ సుకేశ్‌ని ఒక ప్రభుత్వ అధికారిగా తనని పరిచయం చేసింది జాక్వెలిన్ చెప్పింది. మొదట్లో తాను పట్టించుకోలేదని.. అయితే సుకేశ్ హోమ్ మినిస్ట్రీకి చెందిన ఒక ముఖ్యమైన అధికారి అని తన మేకప్ ఆర్టిస్ట్‌ని పింకీ కన్విన్స్ చేసిందని పేర్కొంది. సుకేశ్ తనని తాను సన్ టీవీ ఓనర్‌గా పరిచయం చేసుకున్నాడని, జయలలిత తన ఆంటీ అని చెప్పాడని తెలిపింది. తనకు పెద్ద ఫ్యాన్ అని సుకేశ్ పేర్కొన్నాడని, సన్ టీవీ ఓనర్‌గా తనతో దక్షిణాదిలో సినిమాలు చేస్తానని మాటిచ్చాడని, తాము ఎన్నో ప్రాజెక్టులు చేస్తున్నామని నమ్మబలికాడంది. జైలులో ఉండి కూడా సుకేశ్ తనతో రోజూ మూడుసార్లు ఆడియో లేదా వీడియో కాల్స్ మాట్లాడేవాడని జాక్వెలిన్ రివీల్ చేసింది. రాత్రి పడుకునే ముందు కచ్ఛితంగా ఫోన్ చేసేవాడంది. కానీ.. ఏనాడూ తాను జైల్లో ఉన్న విషయాన్ని అతడు చెప్పలేదని చెప్పింది. అతడు సోఫాలో కూర్చొని మాట్లాడ్డం వల్ల.. తానూ గుర్తించలేకపోయానంది. చివరిసారిగా సుకేశ్ తనతో ఆగస్టు 8వ తేదీన ఫోన్‌లో మాట్లాడాడని, ఆ తర్వాతి నుంచి మళ్లీ కాంటాక్ట్ చేయలేదని జాక్వెలిన్ వెల్లడించింది. ఆ తర్వాత అతడు అరెస్ట్ అయిన విషయం తనకు తెలిసిందని చెప్పుకొచ్చింది.
Hashim Amla: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్
సుకేశ్ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం పింకీకి తెలుసని, అయినా ఏనాడూ తనకు చెప్పలేదని జాక్వెలిన్ వాపోయింది. తనని మోసం చేయాలనే ఉద్దేశంతో సుకేశ్‌తో పింకీ పరిచయం చేసిందని బాంబ్ పేల్చింది. సుకేశ్ తనని ఫూల్ చేశాడని, అతడి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ తెలిసిన తర్వాత అతని అసలు పేరు సుకేశ్ అని తనకు తెలిసిందని చెప్పింది. తాను కేరళకి వెళ్లాలని అనుకున్నప్పుడు.. సుకేశ్ తన ప్రైవేట్ జెట్ వాడుకోమని చెప్పాడని, హెలికాప్టర్ రైడ్ కూడా ఆర్గనైజ్ చేశాడని తెలిపింది. చెన్నైలో రెండు సందర్భాల్లో అతడ్ని కలిసినప్పుడు.. అతని ప్రైవేట్ జెట్‌లో తాను రెండుసార్లు ప్రయాణించానని జాక్వెలిన్ చెప్పుకొచ్చింది. కాగా.. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఇటీవలే ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.
Oldest Woman in the World: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలి మృతి
తాజావార్తలు
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?