Hashim Amla Announced His Retirement From All Formats: సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ హషీం ఆమ్లా సంచలన ప్రకటన చేశాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తాను వైదొలుగుతున్నట్లు కుండబద్దలు కొట్టాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆమ్లా.. ఇప్పుడు మిగతా ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక ఇంగ్లండ్ కౌంటీల్లో సర్రే జట్టుకు ఆమ్లా ఆడుతున్నాడు. అయితే.. ఈ ఏడాది కౌంటీ సీజన్ బరిలోకి దిగడం లేదని స్పష్టం చేశాడు. తన రిటైర్మెంట్ ప్రకటనలో సర్రే టీమ్ స్టాఫ్ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపిన ఆమ్లా.. సర్రే డైరెక్టర్ అలెక్ స్టివర్ట్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ధన్యవాదాలు తెలియజేశాడు. గతేడాది కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా లాంకషైర్‌తో తన చివరి మ్యాచ్ ఆడేసిన ఆమ్లా.. ఆ సీజన్‌లో దాదాపు 40 సగటున 700కు పైగా పరుగులు చేశాడు. అంతేకాదు.. తన జట్టును (సర్రే) ఛాంపియన్‌గా నిలిపాడు.
Bomb Found: రిపబ్లిక్ డే వేడుకలే లక్ష్యం.. మిలిటరీ గ్రౌండ్స్‌లో బాంబు లభ్యం
కాగా.. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఆమ్లా, తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. 55 సెంచరీల సహాయంతో 18,000కు పైగా పరుగులు చేశాడు. వన్డేల్లో వేగంగా 2000, 3000, 4000, 5000, 6000, 7000 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. అంతేకాదు.. వన్డేల్లో అత్యంత 10, 15, 16, 17, 18, 20, 25, 27 శతకాలు చేసిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. సౌతాఫ్రికా టెస్ట్ టీమ్ కెప్టెన్‌గానూ వ్యవహరించిన ఆమ్లా.. టెస్ట్‌ల్లో ట్రిపుల్ హండ్రెడ్ (311 నాటౌట్)తో పాటు ఐపీఎల్‌లోనూ 2 సెంచరీలు సాధించాడు. వన్డేల్లో ఇతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 159. ఎన్నోసార్లు కష్టాల్లో ఉన్న తన జట్టుని ఆదుకొని, గెలుపు దిశగా తీసుకెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. టెస్ట్ ప్లేయింగ్ జట్లపై ఆమ్లా వన్డే సెంచరీలు చేసి, ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు.
Honey Trap: ఆన్‌లైన్ నంబర్‌కి కాల్ చేయగా.. 25 వేలు హాంఫట్