Hathras Stampede: పక్కటెముకలు విరగడం, ఊపిరాడకపోవడంతో మరణాలు..
- పక్కటెముకలు విరగడం
- ఊపిరాడకపోవడంతోనే మరణాలు..
- హత్రాస్ మరణాలపై వైద్యుల రిపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hathras Stampede: ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్ తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భోలే బాబాగా చెప్పబడుతున్న వ్యక్తి ధార్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ఏకంగా 121 మంది మరణించారు. లక్షలాది మంది హాజరైన ఈ కార్యక్రమంలో భోలే బాబా పాదధూళిని తీసుకోవడానికి ఒక్కసారిగా జనాలు ఎగబడటంతో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై యోగి సర్కార్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
Read Also: CM Revanth Reddy: ఢిల్లీ లోనే రేవంత్ రెడ్డి.. నేడు ప్రధానితో భేటీ..
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ఇదిలా ఉంటే, హత్రాస్ ఘటనలో మరణించిన వారి పోస్టుమార్టంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది ఊపిరాడక, ఛాతి గాయాలతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఇప్పటి వరకు నిర్వహించిన 21 పోస్టుమార్టాల్లో తలకు గాయాలు, షాక్, రక్తస్రావం కారణంగానే సంభవించినట్లు తేల్చారు. ఆగ్రాలోని ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీలో ఎనిమిది మంది వైద్యులు పోస్ట్‌మార్టం పరీక్షలు నిర్వహించారు, ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ .. ఛాతిపై గాయాలు, అంతర్గత రక్తస్రావాన్ని గమనించినట్లు తెలిపారు. చాలా మందికి పక్కటెముకలు విరిగిపోవడంతో రక్తస్రావం జరిగిందని రిపోర్టులు వెల్లడించాయి.
80,000 మంది హాజరుకావాల్సిన కార్యక్రమానికి 2.5 లక్షల మంది హాజరుకావడంతో తొక్కిసలాట జరిగింది. అయితే, ఈ మరణాలపై భోలే బాబా స్పందించారు. సంఘ వ్యతిరేక శక్తుల కారణంగానే తొక్కిసలాట జరిగిందని నిన్న ప్రకటించారు. ఘటన జరిగినప్పటి నుంచి ఇతను పరారీలో ఉన్నారు. మరోవైపు పోలీసులు ఇతనికి సంబంధించిన ఆశ్రమాల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో తాను విచారణకు సహకరిస్తానని చెప్పాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో న్యాయ విచారణకు ఆదేశించారు. దోషులను వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్గా బాధ్యతలు స్వీకరణ..
-
Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
-
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!