Student Assaulted By Teacher in UP: కామాంధులు బరి తెగిస్తున్నారు. వావీ వరసలు మరచి ప్రవర్తిస్తున్నారు. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలోొ ఉండీ.. విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువే.. దారి తప్పాడు. తను చదువు చెప్పే విద్యార్థినిపై కన్నేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. రాష్ట్రంలోని డియోరియాలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి 15 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన మాట వినకపోవడవతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన ఉన్నతాధికారులకు తెలియజేయడంతో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు అధికారులు. నిందితుడిపై పోక్సో కేసులో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
Read Also: Mamata Banerjee: దేశంలో అధ్యక్ష తరహా పాలన.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..
సురోొలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న బాలికపై 30 ఏళ్ల ఉపాధ్యాయుడు అక్టోబర్ 25న వేధింపులకు పాల్పడ్డాడని జిల్లా ఎస్పీ సంకల్ప్ శర్మ వెల్లడించారు. అయితే ఉపాధ్యాయుడికి ప్రతిఘటించినందుకు బాలికను తీవ్రంగా కొట్టి బెదిరించాడు. ఇంటికి చేరుకున్న విద్యార్థిని జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కుటుంబ సభ్యులు పోలీసులకు, విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని సస్పెండ్ చేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది.